LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

MATA: మాటా ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026కు నామినేషన్లు ఆహ్వానం! గ్లోబల్ తెలుగు టాలెంట్‌కు గుర్తింపు

Mana America Telugu Association (MATA): అమెరికాలోని తెలుగు సమాజానికి మరొక ప్రత్యేక వేడుకకు రంగం సిద్ధమవుతోంది. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో జూన్ నెలలో జరగనున్న రెండో మహాసభల సందర్భంగా ‘మాటా ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’ను ఘనంగా ప్రదానం చేయనున్నారు.

AndhraPravasi News Desk 1 min read
MATA: మాటా ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026కు నామినేషన్లు ఆహ్వానం! గ్లోబల్ తెలుగు టాలెంట్‌కు గుర్తింపు

ప్రపంచ తెలుగు ప్రతిభను సత్కరించనున్న మాటా..

ఫిలడెల్ఫియాలో మాటా రెండో మహాసభలకు సన్నాహాలు..

అమెరికాలోని తెలుగు సమాజానికి మరొక ప్రత్యేక వేడుకకు రంగం సిద్ధమవుతోంది. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో జూన్ నెలలో జరగనున్న రెండో మహాసభల సందర్భంగా ‘మాటా ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026’ను ఘనంగా ప్రదానం చేయనున్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన తెలుగు వారిని గుర్తించి గౌరవించేందుకు ఈ అవార్డులకు నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఈ మహాసభలు జూన్ 19, 20 తేదీల్లో పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్ (The Greater Philadelphia Expo Center)లో అత్యంత వైభవంగా జరగనున్నాయి. అమెరికాలో నివసిస్తున్న వారితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అర్హులైన తెలుగు వారికి ఈ వేదికపై అవార్డులు అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఈసారి అవార్డులను పలు విభాగాల్లో అందించనున్నారు. వ్యాపారం, సమాజ సేవ, సాహిత్యం, జర్నలిజం, సాంస్కృతిక సేవ, యువత, క్రీడలు, ఇంజనీరింగ్ & ఐటీ, సైన్స్ & టెక్నాలజీ, వైద్యం, అలాగే ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ వంటి విభాగాల్లో విశేష కృషి చేసిన వారిని నామినేట్ చేయవచ్చు. సమాజంలో స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు చెబుతున్నారు.

నామినేషన్లు పంపాలనుకునే వారు అర్హత, నాయకత్వ లక్షణాలు, సమాజ సేవలో చేసిన సేవల వివరాలతో awards@mata-us.org అనే ఈమెయిల్ కు దరఖాస్తు చేయాలి. మే 18, 2026ను చివరి తేదీగా నిర్ణయించారు. తెలుగు సమాజంలో ప్రతిభను వెలికితీసి, సేవా భావాన్ని ప్రోత్సహించే ఈ అవార్డ్స్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మటా సభ్యులు కోరుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…