LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Europe: డెన్మార్క్ వీధుల్లో భారత జెండాల రెపరెపలు.. అమరావతి బిల్లు ఆమోదంతో యూరోప్‌లో సంబరాలు..

Europe: భారత్ పార్లమెంట్లో అమరావతి బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా డెన్మార్క్‌లో తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి.

AndhraPravasi News Desk 1 min read
Europe: డెన్మార్క్ వీధుల్లో భారత జెండాల రెపరెపలు.. అమరావతి బిల్లు ఆమోదంతో యూరోప్‌లో సంబరాలు..
  • "చారిత్రక ఘట్టం.. అద్భుత నగరం": అమరావతి బిల్లు ఆమోదంతో యూరోప్‌లో మిఠాయిల పంపిణీ..
     
  • Europe: డెన్మార్క్ వీధుల్లో భారత జెండాల రెపరెపలు: అమరావతి పోస్టర్లతో తెలుగు యువత కోలాహలం..

Europe: భారత్ పార్లమెంట్లో అమరావతి బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా డెన్మార్క్‌లో తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. 
    •    తెలుగు సభ్యులు పెద్ద ఎత్తున కూడి ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు.
    •    భారత జెండాలు, అమరావతి పోస్టర్లు, బ్యానర్లతో ప్రాంగణం కళకళలాడింది.
    •    సంప్రదాయ దుస్తుల్లో యువత, కుటుంబాలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.
    •    నినాదాలు, శుభాకాంక్షలతో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. 
    •    మిఠాయిల పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

మొత్తంగా, డెన్మార్క్‌లోని తెలుగు యువత తమ ఆనందాన్ని ఒక పండుగలా జరుపుకుని, అమరావతి పట్ల తమ అనుబంధాన్ని చూపించారు. ఈ సందర్భంగా డెన్మార్క్ టీడీపీ అధ్యక్షుడు హరీబాబు చెరుకూరి మాట్లాడుతూ, ఇక అమరావతి అభివృద్ధిని అడ్డుకునే వారు ఎవరూ లేరని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం అజరామరంగా కొనసాగుతుందని, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

యూరోప్ రీజియన్ కౌన్సిల్ మెంబర్ అయిన అమర్నాథ్ పొట్లూరి గారు మాట్లాడుతూ, ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపుతుందని, ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దడానికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సమర్థుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యువ నాయకులు లోకేశ్ గారు మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతుందని అన్నారు.

అమరావతిని ప్రపంచ స్థాయి అద్భుత నగరంగా తీర్చిదిద్దగల సామర్థ్యం ఈ నాయకత్వానికి ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే, ఈ దిశగా ప్రజల సహకారం కూడా కీలకమని, అందరూ కలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…