China-USA: మా అంతర్గత విషయాల్లో జోక్యం వద్దు.... అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్! USA: వేడుకల్లో విషాదం.. పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి.! Iran-USA: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం... అదే కారణం! Middle East Conflict: ఇది చెడు వార్త.. ఇరాన్ మా షరతులకు అంగీకరించలేదు..జేడీ వెన్స్ కీలక ప్రకటన..! Donald Trump: చాగోస్ దీవుల అప్పగింతకు బ్రిటన్ బ్రేక్.. ట్రంప్ వ్యతిరేకతతో ఒప్పందం నిలిపివేత! Jag Vikram: ఉద్రిక్తతల వీడిన వేళ.. హార్ముజ్ జలసంధిలో రెపరెపలాడిన భారత జెండా! COP 33: భారత్ సంచలన నిర్ణయం... 2028 'కాప్ 33' సదస్సు హోస్టింగ్ నుంచి విరమణ! UAE Updates: యుద్ధ క్షేత్రంలో జయశంకర్... శాంతి దూతగా భారత్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..! Middle East Conflict: లెబనాన్‌తో శాంతి చర్చలకు నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ హిజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని హెచ్చరిక! China-USA: మా అంతర్గత విషయాల్లో జోక్యం వద్దు.... అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్! USA: వేడుకల్లో విషాదం.. పుట్టినరోజు నాడే అమెరికాలో బొబ్బిలి టెక్కీ మృతి.! Iran-USA: అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం... అదే కారణం! Middle East Conflict: ఇది చెడు వార్త.. ఇరాన్ మా షరతులకు అంగీకరించలేదు..జేడీ వెన్స్ కీలక ప్రకటన..! Donald Trump: చాగోస్ దీవుల అప్పగింతకు బ్రిటన్ బ్రేక్.. ట్రంప్ వ్యతిరేకతతో ఒప్పందం నిలిపివేత! Jag Vikram: ఉద్రిక్తతల వీడిన వేళ.. హార్ముజ్ జలసంధిలో రెపరెపలాడిన భారత జెండా! COP 33: భారత్ సంచలన నిర్ణయం... 2028 'కాప్ 33' సదస్సు హోస్టింగ్ నుంచి విరమణ! UAE Updates: యుద్ధ క్షేత్రంలో జయశంకర్... శాంతి దూతగా భారత్! Middle East Peace: అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు.. నేడు ఇస్లామాబాద్ వేదికగా శాంతి దిశగా అడుగులు..! Middle East Conflict: లెబనాన్‌తో శాంతి చర్చలకు నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ హిజ్బుల్లాపై దాడులు కొనసాగుతాయని హెచ్చరిక!

NRI Property Sale India: ఎన్ఆర్ఐలు ఆస్తి అమ్ముతున్నారా? ఒక్క రూపాయి టాక్స్ కట్టకుండా కోట్లు సేవ్ చేసే 'బ్లూ ప్రింట్' ఇదే!

NRI Property Sale India: భారత్‌లో ఎన్ఆర్ఐలు ఆస్తి అమ్మేటప్పుడు భారీగా కట్ అయ్యే టీడీఎస్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ నుండి ఎలా తప్పించుకోవాలో..సెక్షన్ 54, 197 ఇండెక్సేషన్ బెనిఫిట్స్ ఉపయోగించి ఒక్క రూపాయి పన్ను కట్టకుండా కోట్లు ఎలా ఆదా చేయాలో పూర్తి వివరాలు..

Published : 2026-03-14 09:12:00

NRI Property Sale India: విదేశాల్లో స్థిరపడిన భారతీయులు NRIs స్వదేశంలో ఉన్న తమ ఆస్తిని అమ్మేటప్పుడు పన్నుల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భారీగా కట్ అయ్యే టీడీఎస్ TDS క్యాపిటల్ గెయిన్ టాక్స్ వల్ల వచ్చే లాభంలో సగం ప్రభుత్వం పాలవుతుందనే భయం చాలామందిలో ఉంది. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకుంటే, ఒక్క రూపాయి కూడా పన్ను కట్టకుండా మీ సొమ్మును మీరు కాపాడుకోవచ్చని ప్రముఖ అడ్వకేట్ నిపుణులు వివరిస్తున్నారు. 

24 నెలల మ్యాజిక్: లాంగ్ టర్మ్ బెనిఫిట్ అంటే ఏమిటి?

మీరు అమ్మే ఆస్తి మీ దగ్గర 24 నెలల కంటే ఎక్కువ కాలం ఉంటే, దాన్ని 'లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్' అంటారు. ఇలాంటి ఆస్తుల అమ్మకంపై 'ఇండెక్సేషన్' అనే గొప్ప వెసులుబాటు ఉంటుంది. అంటే, మీరు పదేళ్ల క్రితం కొన్న ధరను ఇప్పటి ద్రవ్యోల్బణం ప్రకారం లెక్కించి, దాని విలువను పెంచుతారు. దీనివల్ల మీకు వచ్చిన లాభం తక్కువగా కనిపిస్తుంది, ఫలితంగా పన్ను భారం భారీగా తగ్గుతుంది. ఉదాహరణకు, గతంలో 20 లక్షలకు కొన్న ఆస్తి విలువ ఇండెక్సేషన్ ప్రకారం నేడు 60 లక్షల పైమాటే కావచ్చు. అప్పుడు మీరు కేవలం మిగిలిన మార్జిన్ మీద మాత్రమే పన్ను లెక్కించాల్సి ఉంటుంది.

టీడీఎస్  నుంచి విముక్తి.. లోయర్ టీడీఎస్ సర్టిఫికేట్!

సాధారణంగా ఎన్ఆర్ఐలు ఆస్తి అమ్మేటప్పుడు కొనుగోలుదారు (Buyer) 20 నుండి 30 శాతం టీడీఎస్ కట్ చేస్తారు. ఇది మీ చేతికి వచ్చే నగదును (Cash Flow) తగ్గిస్తుంది. అయితే, సెక్షన్ 197 ప్రకారం మీరు ఆస్తి అమ్మకానికి ముందే 'లోయర్ టీడీఎస్ సర్టిఫికేట్' కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ పన్ను బాధ్యత తక్కువగా ఉందని నిరూపిస్తే, ఆదాయపు పన్ను శాఖ 0% లేదా అతి తక్కువ శాతానికి అనుమతినిస్తుంది. దీనివల్ల మీ సొమ్ము మీ దగ్గరే ఉంటుంది, రీఫండ్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు.

 సెక్షన్ 54: కొత్త ఇల్లు కొనండి.. పన్నును సున్నా చేయండి

ఒక ఇంటిని అమ్మి వచ్చిన డబ్బుతో మరో నివాస గృహాన్ని కొనుగోలు చేస్తే సెక్షన్ 54 కింద పూర్తి పన్ను మినహాయింపు పొందవచ్చు.

సమయ పరిమితి: ఆస్తి అమ్మకానికి ఒక ఏడాది ముందు కొన్నా, లేదా అమ్మిన రెండేళ్ల లోపు కొన్నా ఈ మినహాయింపు వర్తిస్తుంది.

నిర్మాణం: ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకుంటే మూడేళ్ల సమయం ఉంటుంది.

ఈ వెసులుబాటు గరిష్టంగా 10 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఇల్లు కొనడం ఇష్టం లేకపోతే NHAI లేదా REC వంటి బాండ్లలో 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి కూడా పన్ను ఆదా చేయవచ్చు.

2001 ఇండెక్స్ రూల్ పాత ఆస్తులకు వరం!

మీరు 1980 లేదా 90లలో తక్కువ ధరకు కొన్న ఆస్తులు లేదా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తుల విషయంలో 2001 ఇండెక్స్ రూల్ చాలా కీలకం. ఏప్రిల్ 1, 2001 నాటి ఫెయిర్ మార్కెట్ వాల్యూ (FMV)ని తీసుకుని దాని ప్రకారం ప్రస్తుత విలువను లెక్కిస్తారు. దీనివల్ల పాత ఆస్తుల మీద వచ్చే భారీ లాభాలను చట్టబద్ధంగా తగ్గించుకునే వీలుంటుంది. అనవసరంగా ఎక్కువ పన్ను కట్టి నష్టపోకుండా ఈ సూత్రాన్ని వాడటం ఎన్ఆర్ఐలకు ఎంతో మేలు.

 2026 బడ్జెట్ మార్పులు.. ఇక ట్యాన్ (TAN) తోనే పని

కేంద్ర బడ్జెట్ 2026 లో ఎన్ఆర్ఐల కోసం కీలక మార్పులు రాబోతున్నాయి. ఇకపై టీడీఎస్ రికవరీ కోసం ఇబ్బంది పడకుండా, కేవలం ట్యాన్ నెంబర్ ఉంటే సరిపోయేలా నిబంధనలు సులభతరం కానున్నాయి. అయితే, 50సి సెక్షన్ ప్రకారం స్టాంప్ డ్యూటీ కంటే తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేయకూడదని, అలాగే 20 వేల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరపకూడదని అడ్వకేట్ హెచ్చరిస్తున్నారు. సరైన ప్లానింగ్‌తో వెళ్తే ఎన్ఆర్ఐలు తమ కష్టార్జితాన్ని పన్నుల రూపంలో నష్టపోకుండా కాపాడుకోవచ్చు.

Spotlight

Read More →