LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Komati Jayaram: ఫిలడెల్ఫియాలో కోమటి జయరాం ఘన సత్కారం!

Komati Jayaram: ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం… ప్రభుత్వానికి, ప్రవాసాంధ్రులకు మధ్య ఒక బలమైన వారధిగా నిలుస్తారని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డా. నోరి దత్తాత్రేయుడు అన్నారు.

AndhraPravasi News Desk 1 min read
Komati Jayaram: ఫిలడెల్ఫియాలో కోమటి జయరాం ఘన సత్కారం!

ప్రవాసాంధ్రులకు – ప్రభుత్వానికి వారధిగా కోమటి జయరాం: డా. నోరి దత్తాత్రేయుడు..

ప్రభుత్వ పాఠశాలలకు సాంకేతిక విద్యలో ప్రవాసులు సహకరించాలి..

ఫిలడెల్ఫియా: ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం.. ప్రభుత్వానికి, ప్రవాసాంధ్రులకు మధ్య ఒక బలమైన వారధిగా నిలుస్తారని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డా. నోరి దత్తాత్రేయుడు అన్నారు. ఆదివారం ఫిలడెల్ఫియాలో ఘనంగా నిర్వహించిన జయరాం అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని భావోద్వేగంగా ప్రసంగించారు.

గత నాలుగున్నర దశాబ్దాలుగా అమెరికాలో తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ… తెలుగుజాతి గౌరవాన్ని జయరాం నిలబెట్టారని డా. నోరి ప్రశంసించారు. తనకు ఎన్‌టీఆర్ అంటే ఎంతో అభిమానమని చెబుతూ.. ఆయన సతీమణి పేరుతో ప్రారంభమైన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఆ కుటుంబంతో తనకు ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా కోమటి జయరాం మాట్లాడారు. “నేను కూడా ఒక ప్రవాసాంధ్రుడినే కావడంతో.. నా పరిస్థితులు తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బాధ్యత నాకప్పగించారు. ప్రభుత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు పూర్తి నిబద్ధతతో పనిచేస్తాను” అని తెలిపారు. ప్రవాసాంధ్రులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్య అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు.

అలాగే, ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్ డేటా సెంటర్ రావడం రాష్ట్రానికి గర్వకారణమని జయరాం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ వీడియో సందేశాలు అందించారు.

కార్యక్రమంలో పొట్లూరి రవి, మన్నవ సుబ్బారావు, భాను మాగులూరి, రాధాకృష్ణ మూల్పురి, రంజిత్ కోమటి, మురళి పమిడిముక్కల, ఫణి కంతేటి, శ్రీధర్ సాదినేని, నందగిరీష్ మూల్పూరి, నాగరాజు చింతం, సురేష్ యలమంచిలి, గోపి వాగ్వాల, హరనాథ్ బుంగతావుల, విశ్వనాథ్ కోగంటి, లావా ఐనంపూడి, గౌరి కొర్రోతు, సాయి బొల్లినేని, మధు ముప్పాల, శ్రీధర్ వీరమాచినేని, శ్రీహరి మందడి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ అభినందన సభలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు జయరాంను అభినందిస్తూ.. ఆయన కొత్త బాధ్యతల్లో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…