LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Gudivada: రైతన్నలకు అండగా తానా.. స్ప్రేయర్లు, టార్పలిన్ల పంపిణీ!

Gudivada: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి రైతుల పక్షాన నిలిచింది. తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఈవీపీ శ్రీనివాస్ లావు నాయకత్వంలో, తానా ట్రెజరర్ కసుకుర్తి రాజా సౌజన్యంతో, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకారంతో గుడివాడ నియోజకవర్గ రైతులకు రూ.25 లక్షల విలువైన వ్యవసాయ సామ…

AndhraPravasi News Desk 2 min read
Gudivada: రైతన్నలకు అండగా తానా.. స్ప్రేయర్లు, టార్పలిన్ల పంపిణీ!

గుడివాడలో రైతులకు భారీగా వ్యవసాయ పరికరాల పంపిణీ..

తానా సేవా కార్యక్రమంతో 700 మంది రైతులకు లాభం..

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి రైతుల పక్షాన నిలిచింది. తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఈవీపీ శ్రీనివాస్ లావు నాయకత్వంలో, తానా ట్రెజరర్ కసుకుర్తి రాజా సౌజన్యంతో, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకారంతో గుడివాడ నియోజకవర్గ రైతులకు రూ.25 లక్షల విలువైన వ్యవసాయ సామగ్రిని అందజేశారు. పి-4 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం గుడివాడ మార్కెట్ యార్డ్‌లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో రైతులకు 700 టార్పలిన్లు, 100 చార్జింగ్ స్ప్రేయర్లను పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నేతల సమక్షంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రైతులకు ఈ సామగ్రిని అందజేశారు. ముందుగా రైతులతో కలిసి స్ప్రేయర్లు, టార్పలిన్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, దేశం పట్ల ప్రేమతో సేవా కార్యక్రమాలు నిర్వహించే గొప్ప సంస్థ తానా అని ప్రశంసించారు. రైతు కుటుంబంలో పుట్టిన తానా ట్రెజరర్ కసుకుర్తి రాజా వేలాది మంది రైతులకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. రైతుల కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు.

ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. వరదల సమయంలో రైతులకు అండగా నిలిచామని, కాలువల అభివృద్ధి, డ్రైనేజీల్లో సిల్ట్ తొలగింపు పనులు చేపట్టి రైతుల ఎన్నో ఏళ్ల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజలకు మేలు చేసే ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.

తానా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ, “రైతు కోసం” అనే తానా కాన్సెప్ట్‌లో భాగంగానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు మూడు నియోజకవర్గాల్లో రూ.1.03 కోట్ల విలువైన సహాయ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. ఎమ్మెల్యే రాము కృషి వల్లే గుడివాడలో ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు.

రైతులకు టార్పలిన్లు, ఖరీదైన చార్జింగ్ స్ప్రేయర్లు ఉచితంగా అందించడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సబ్సిడీతో అందించే పరికరాలను ఉచితంగా ఇప్పించేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే రాముకు, దాతృత్వంతో సహాయం అందించిన తానా ట్రెజరర్ కసుకుర్తి రాజాకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గుడివాడ, గుడ్లవల్లేరు మార్కెట్ యార్డ్ చైర్మన్లు చాట్రగడ్డ రవికుమార్, పొట్లూరి రవి, జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టిడిపి, జనసేన నేతలు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రైతుల అవసరాలను గుర్తించి వారికి నేరుగా ఉపయోగపడే పరికరాలను అందించడం పట్ల స్థానికంగా ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…