LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతి!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

CTA: డబ్లిన్‌లో ఘనంగా హోలీ కార్నివాల్! సీటీఏ ఆధ్వర్యంలో రంగుల పండుగకు సిద్ధం!

Columbus Telangana association (CTA): కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ (CTA) ఆధ్వర్యంలో ఈ ఏడాది హోలీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమెరికాలోని ఓహియో రాష్ట్రం, డబ్లిన్ నగరంలో “హోలీ కార్నివాల్” పేరుతో ఈ రంగుల పండుగను జరుపుకోనున్నారు.

AndhraPravasi News Desk 1 min read
CTA: డబ్లిన్‌లో ఘనంగా హోలీ కార్నివాల్! సీటీఏ ఆధ్వర్యంలో రంగుల పండుగకు సిద్ధం!

డబ్లిన్ నగరంలో “హోలీ కార్నివాల్” పేరుతో  రంగుల పండుగ..

డీజే సంగీతం, ఉత్సాహభరితమైన డ్యాన్స్ ప్రదర్శనలు..

కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ (CTA) ఆధ్వర్యంలో ఈ ఏడాది హోలీ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమెరికాలోని ఓహియో రాష్ట్రం, డబ్లిన్ నగరంలో “హోలీ కార్నివాల్” పేరుతో ఈ రంగుల పండుగను జరుపుకోనున్నారు. తెలుగు కుటుంబాలు, స్నేహితులు కలిసి ఆనందంగా గడిపేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

ఈ వేడుకలు ఏప్రిల్ 19 (ఆదివారం) మధ్యాహ్నం 1:30 గంటల నుండి డబ్లిన్ కాఫ్మన్ పెవిలియన్ వేదికగా ప్రారంభం కానున్నాయి. రంగుల హరివిల్లుల మధ్య సందడి వాతావరణంలో ఈ కార్యక్రమం సాగనుంది.

కార్యక్రమంలో వినోదానికి పెద్దపీట వేశారు. డీజే సంగీతం, ఉత్సాహభరితమైన డ్యాన్స్ ప్రదర్శనలు, కార్నివాల్ తరహాలో వివిధ వినోద కార్యక్రమాలు పాల్గొనేవారిని అలరించనున్నాయి. చిన్నా పెద్దా అందరూ ఆనందంగా పాల్గొనేలా ప్రత్యేకంగా ప్లాన్ చేశారు.

ఈ వేడుకలకు ఎంట్రీ పూర్తిగా ఉచితం కావడం ప్రత్యేక ఆకర్షణ. అలాగే అసోసియేషన్ మెంబర్లకు 2 ఉచిత కలర్ ప్యాకెట్లు, 2 ఉచిత కార్నివాల్ బ్యాండ్లు అందజేయనున్నారు. పాల్గొనేవారికి రుచికరమైన వంటకాలు అందించేందుకు వివిధ ఫుడ్ వెండర్స్ కూడా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమ ఏర్పాట్లను సీటీఏ ప్రతినిధులు రంజిత్ గంపా, విష్ణు తూముల, పవిత్ర కోట, పున్నం వెల్పుల, సృజన్ రెడ్డి, సురేష్ ముఖిరాల సమన్వయంతో పర్యవేక్షిస్తున్నారు. తెలుగు కుటుంబాలన్నీ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ రంగుల పండుగను విజయవంతం చేయాలని వారు కోరారు. మరిన్ని వివరాలు మరియు రిజిస్ట్రేషన్ కోసం www.zeffy.com/en-US/ticketing/holi-2 వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…