LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Australia: మెల్‌బోర్న్‌లో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు!

Australia: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఎన్నారై టీడీపీ మెల్బోర్న్ Inc ఆధ్వర్యంలో నిర్వహించిన “మనా నాయకుడు – మన రాజధాని” కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

AndhraPravasi News Desk 1 min read
Australia: మెల్‌బోర్న్‌లో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు!

మనా నాయకుడు – మన రాజధాని కార్యక్రమం..

సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, ప్రసంగాలు..

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఎన్నారై టీడీపీ మెల్బోర్న్ Inc ఆధ్వర్యంలో నిర్వహించిన “మనా నాయకుడు – మన రాజధాని” కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది.

ఈ వేడుకలకు వందలాది మంది తెలుగు ప్రజలు, యువత, కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. తమ అభిమాన నాయకుడిపై ఉన్న ప్రేమాభిమానాలను ఉత్సాహంగా వ్యక్తం చేశారు. కార్యక్రమం ప్రారంభంలోనే తెలుగు గర్వకారణమైన నందమూరి తారక రామారావు కు నివాళులు అర్పించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, ప్రేరణాత్మక ప్రసంగాలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాల్గొన్న వక్తలు చంద్రబాబు దూరదృష్టి, అభివృద్ధి పట్ల ఆయన అంకితభావం, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో చేసిన కృషిని ప్రశంసించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చూపిస్తున్న మార్గదర్శకత్వం గురించి కూడా ప్రస్తావించారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ మెల్బోర్న్ Inc అధ్యక్షురాలు వినీలా, ఉపాధ్యక్షురాలు కల్యాణి, అడ్వైజరీ సభ్యుడు బలుసు కిషోర్, పరిపూర్ణ, గోకుల్ లింగమనేని, రవితేజ, విలియమ్స్, దుర్గప్రసాద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ వేడుకలు ఒక పండుగలా సాగి, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల ఐక్యతను, తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటిచెప్పాయి.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…