AP Ministers: సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం... తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం! Iran-USA: అంతర్జాతీయ మార్కెట్‌లో కొత్త చర్చ.. ట్రంప్ వ్యూహం ఫలించిందా!! USA Iran: అమెరికాతో రెండో విడత చర్చలు! ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఇరాన్...! Louisiana Shooting: అమెరికాలో దారుణం.. లూసియానాలో కాల్పుల ధాటికి 8 మంది చిన్నారుల బలి! Middle East War: భారత ఆయిల్ షిప్పులపై ఇరాన్ దాడుల ప్రయత్నం.. రంగంలోకి దిగిన జైశంకర్! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Donald Trump: అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు... ఇరాన్ అణు కార్యక్రమంపై ట్రంప్ అప్డేట్! US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా అడుగులు.. పాకిస్థాన్‌కు వెళ్లనున్న ట్రంప్? Ceasefire: లెబనాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ... వాషింగ్టన్‌లో కీలక ఒప్పందం! AP Ministers: సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం... తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం! Iran-USA: అంతర్జాతీయ మార్కెట్‌లో కొత్త చర్చ.. ట్రంప్ వ్యూహం ఫలించిందా!! USA Iran: అమెరికాతో రెండో విడత చర్చలు! ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఇరాన్...! Louisiana Shooting: అమెరికాలో దారుణం.. లూసియానాలో కాల్పుల ధాటికి 8 మంది చిన్నారుల బలి! Middle East War: భారత ఆయిల్ షిప్పులపై ఇరాన్ దాడుల ప్రయత్నం.. రంగంలోకి దిగిన జైశంకర్! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! Donald Trump: అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపు... ఇరాన్ అణు కార్యక్రమంపై ట్రంప్ అప్డేట్! US Iran Deal: ఇరాన్‌తో శాంతి ఒప్పందం దిశగా అడుగులు.. పాకిస్థాన్‌కు వెళ్లనున్న ట్రంప్? Ceasefire: లెబనాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ... వాషింగ్టన్‌లో కీలక ఒప్పందం!

Uganda: ఉగాండాలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు!

Uganda: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని విదేశాల్లోని తెలుగు ప్రజలు ఉత్సాహంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగాండా లోని కంపాలా నగరంలో ఎన్నారై టీడీపీ కార్యకర్తలు ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు.

Published : 2026-04-21 14:29:00

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు..

కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని విదేశాల్లోని తెలుగు ప్రజలు ఉత్సాహంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగాండా లోని కంపాలా నగరంలో ఎన్నారై టీడీపీ కార్యకర్తలు ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు.

సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యకర్తలు చిన్నా చౌదరి గరికపాటి, దొడ్డ శేషు బాబు, భాను, కళ్యాణ్, మురళి, గడిపర్తి శేషు, పొన్నం కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రశంసించారు. ఆయన విజన్, విజ్ఞానం రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా ఉందని పేర్కొన్నారు.

ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో చంద్రబాబు పాత్ర అపారమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఏకం చేసే ఆయన దూరదృష్టి ప్రశంసనీయమని తెలిపారు. డిజిటల్ అభివృద్ధి, పారదర్శక పాలనలో ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు.

యువతకు అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారని కొనియాడారు. ఎన్నారైల మద్దతుతో రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కృషికి తమ సంపూర్ణ సహకారం ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు గారు ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో మరెన్నో విజయాలు సాధించాలని, ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

Spotlight

Read More →