LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Saudi Arabia: సౌది అరేబియాలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు!

Saudi Arabia: సౌది అరేబియా తూర్పు ప్రాంతంలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.

AndhraPravasi News Desk 2 min read
Saudi Arabia: సౌది అరేబియాలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు!

సౌది లో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు..

కార్యక్రమానికి తరలి వచ్చిన కూటమి కార్యకర్తలు..

సౌది అరేబియా తూర్పు ప్రాంతంలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ఉత్సాహభరితంగా సాగి, అక్కడి తెలుగు సమాజం ఐక్యతను ప్రతిబింబించాయి.

ఈ కార్యక్రమానికి శ్రీ నాగశేఖర్ వ్యాఖ్యాతగా వ్యవహరించి సభను సమర్థంగా నడిపించారు. ప్రముఖ వ్యాపారవేత్త, H S Steel అధిపతి మరియు నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి అభిమాని అయిన శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయకత్వం ఎంత అవసరమో వివరించారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రం ఎదుర్కొన్న నష్టాలను కూడా ప్రస్తావించారు.

శ్రీ నాగేశ్వరరావు బులుసు మాట్లాడుతూ, తాను మరియు జుబైల్ బృందం గత పదేళ్లుగా తెలుగుదేశం పార్టీపై అభిమానంతో అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

సభలో అనిత నాగశేఖర్, డా. కిరణ్ కుమార్ యాదవ్, రవి మల్లిన, కిషోర్ పారెపల్లి, కేవీఎన్ రాజు, దిలీప్ కుమార్ నేట్యం, రోహిత్ నందా, వంశీకృష్ణ, మారుతీ గౌడ్, శ్రీధర్ గౌడ, మనోహర్ ప్రసాద్, విజయ్ కుమార్ సుంకవల్లి, రాజేష్, చలసాని హరికృష్ణ తదితరులు ప్రసంగించారు. వారు తమ అనుభవాలను, చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని సభలో పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో యువత పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుమారి నూహారి చౌదరి మాట్లాడుతూ, గూగుల్‌లో వెదికితే చంద్రబాబు ప్రపంచంలో అత్యంత ప్రభావశీలులలో ఒకరని చెప్పింది. కుమారి గీతాంజలి మాట్లాడుతూ, రైతులకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యత, ఐటీ రంగంలో చేసిన సేవలను గుర్తు చేస్తూ, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేసింది.

సంపత్ కోయా తన విద్యార్థి దశలో చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలలో పాల్గొన్న అనుభవాలను పంచుకున్నారు. వరప్రసాద్ మాట్లాడుతూ, APNRTS సేవలను ప్రవాసాంధ్రులందరికీ చేరవేయాలని సూచించారు.

అలాగే P4 కార్యక్రమంపై మాట్లాడిన వక్తలు, అందరం కలిసికట్టుగా గ్రామాలు, మండలాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వరప్రసాద్ తన స్వంత మండలం బొమ్మనహాళ్‌లో చేపడుతున్న సేవలను వివరించారు.

అఖరిగా కోనేరు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, చంద్రబాబు నాయకత్వంలోని ముందుచూపు, క్రమశిక్షణ, దార్శనికత, నిబద్ధత వంటి లక్షణాలను మన జీవితాల్లో కూడా అనుసరించాలని సూచించారు. హుదూద్ తుఫాను మరియు ఇటీవల కృష్ణా నది వరదల సమయంలో ఆయన చూపిన కార్యదక్షతను కొనియాడారు.మొత్తంగా ఈ వేడుకలు సౌది అరేబియాలోని తెలుగు ప్రజల ఐక్యతను, తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని ప్రతిబింబిస్తూ విజయవంతంగా ముగిశాయి.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…