USA F1-Visa: 30 సెకన్లలో ఫైనల్ డెసిషన్.. ఇండియన్ విద్యార్థికి అమెరికా షాక్.. F-1 వీసా ఇంటర్వ్యూలో..! H-1B PERM : అమెరికాలో విదేశీ ఉద్యోగదారులకు ఊరట.. మళ్లీ ప్రారంభమైన H-1B & PERM దరఖాస్తులు! Saudi Updates: సౌదీ అరేబియాలో మూడు దశల్లో సైరన్ టెస్ట్... మొబైల్‌కు హెచ్చరిక, అలర్ట్ టోన్.. ఆ తర్వాత సైరన్ సౌండ్! అమెరికాలో టెన్షన్.. హెచ్-1బీ, ఈఏడీ, గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా ట్రంప్ కొత్త రూల్స్! భారతీయులకు కొత్త సవాళ్లు! Qatar: ఖతార్ లో కార్తీక మాస వనభోజనాలు..! పెద్దఎత్తున హాజరైన ప్రవాసాంధులు..! అమెరికాలోని టాప్ 30 ఎయిర్‌పోర్టుల్లో సగం చోట్ల ఇదే సమస్య... దేశవ్యాప్తంగా ఆందోళన! రాబోయే వారం కూడా.. OCI కార్డు హోల్డర్లకు బంపర్ న్యూస్.. ఇండియాలో ఆధార్ కార్డు పొందడానికి ఇప్పుడే అప్లై చేయండి! H-1B : అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఇప్పుడు కొత్త మార్గం! హెచ్-1బీ కంటే సులభంగా.. NRI: తిరిగి అక్కడికి వెళ్లను! అమెరికా ఒత్తిడిని వదిలి ఆసియాలో స్థిరపడ్డ యువకుడు! Gulf Air: షాకిచ్చిన చెన్నై కోర్టు! రూ.లక్ష జరిమానా.. USA F1-Visa: 30 సెకన్లలో ఫైనల్ డెసిషన్.. ఇండియన్ విద్యార్థికి అమెరికా షాక్.. F-1 వీసా ఇంటర్వ్యూలో..! H-1B PERM : అమెరికాలో విదేశీ ఉద్యోగదారులకు ఊరట.. మళ్లీ ప్రారంభమైన H-1B & PERM దరఖాస్తులు! Saudi Updates: సౌదీ అరేబియాలో మూడు దశల్లో సైరన్ టెస్ట్... మొబైల్‌కు హెచ్చరిక, అలర్ట్ టోన్.. ఆ తర్వాత సైరన్ సౌండ్! అమెరికాలో టెన్షన్.. హెచ్-1బీ, ఈఏడీ, గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా ట్రంప్ కొత్త రూల్స్! భారతీయులకు కొత్త సవాళ్లు! Qatar: ఖతార్ లో కార్తీక మాస వనభోజనాలు..! పెద్దఎత్తున హాజరైన ప్రవాసాంధులు..! అమెరికాలోని టాప్ 30 ఎయిర్‌పోర్టుల్లో సగం చోట్ల ఇదే సమస్య... దేశవ్యాప్తంగా ఆందోళన! రాబోయే వారం కూడా.. OCI కార్డు హోల్డర్లకు బంపర్ న్యూస్.. ఇండియాలో ఆధార్ కార్డు పొందడానికి ఇప్పుడే అప్లై చేయండి! H-1B : అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఇప్పుడు కొత్త మార్గం! హెచ్-1బీ కంటే సులభంగా.. NRI: తిరిగి అక్కడికి వెళ్లను! అమెరికా ఒత్తిడిని వదిలి ఆసియాలో స్థిరపడ్డ యువకుడు! Gulf Air: షాకిచ్చిన చెన్నై కోర్టు! రూ.లక్ష జరిమానా..

Bhagavad Gita: దేహం నశించేది, ఆత్మ నిత్యమైనది.. క్షేత్ర క్షేత్రజ్ఞ యోగం లోతైన సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -52!

2025-11-05 21:35:00

ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,

సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..

సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 52వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.

ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.

ఓం వ్యాసదేవాయ నమః

పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో

శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి

52. ఓం క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞాన ప్రదాయై నమః

భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగంలో పరమాత్మ చెపుతున్నారు.

ఇదం శరీరం కౌంతేయ 
 క్షేత్రమిత్యభిధీయతే । 
ఏతద్యో వేత్తి తం ప్రాహుః 
 క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ॥ 13.2  

అర్థం:  క్షేత్రము అంటే శరీరం. క్షేత్రజ్ఞుడు అంటే శరీరం గూర్చి తెలిసిన వాడు.

‘క్షీయతే ఇతి క్షేత్రః’. క్షేత్రం అంటే క్షీణించేది. క్షేత్రం (శరీరం) పంచభూతాత్మకమైనది, వికారంతో కూడినది. అంటే మారుతూ ఉండేది.  నశ్వరమైనది. ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక చోట దేహం రాలిపోవాల్సిందే. ‘శీర్యతే ఇతి శరీరమ్‌’. శరీరం అంటే నశించేది. అయితే క్షేత్రమైన ఈ శరీరం జ్ఞానబీజం నాటుకోవటానికి, కాలక్రమంలో మోక్షఫలం పొందటానికి ఆధారం.

ఇది క్షేత్రం, ఇది వికారాలు చెందేది అని తెలుసుకొనేవారు ఎవరైతే ఉన్నారో అతడే క్షేత్రజ్ఞుడు, ప్రత్యగాత్మ. ఏ వికారం (మార్పు) లేని వాడు. శాశ్వతుడు. దేహానికి, దేహ వ్యవహారాలైన ఇంద్రియాలకు సాక్షి. ప్రత్యగాత్మ దేహంలో ఉన్నా, దేహానికి సాక్షియై, జాగ్రత్‌ స్వప్న సుషుప్తులనే మూడు అవస్థలలోను మేల్కొని యుండి, అంతటినీ గమనిస్తూ ఉంటాడు. గమనించబడే దేహం వేరు; గమనించే నీవు (ఆత్మ) వేరు అని గీతాబోధ. అదే క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానం.

సమస్త క్షేత్రాలలోను(దేహాలలో) నన్ను క్షేత్రజ్ఞుడుగా తెలుసుకో అంటున్నారు పరమాత్మ. అంటే సాక్షాత్తు పరమాత్మయే సమస్త ప్రాణుల్లో క్షేత్రజ్ఞుడుగా ఉన్నారని భావం. ప్రపంచం మొత్తం, దృశ్యం మొత్తం క్షేత్రమే. దృశ్యమును దర్శిస్తున్నవాడు ద్రష్ట. దృశ్యం వేరు ద్రష్ట వేరు. నేను క్షేత్రజ్ఞుడను. నేను ద్రష్టను.

క్షేత్రజ్ఞుడు లేదా పరమాత్మ ఎవరు, ఎట్టివారు అనేది అనుభవపూర్వకంగా తెలుసుకొంటే అమృతాన్ని పొందినట్లే. మరణం లేని స్థితి - అదే మోక్షం. మరణం లేనప్పుడు జననం కూడా లేదు. అంటే జనన మరణ చక్రంనుండి బయటపడినట్లే.

నేను క్షేత్రాన్ని కాను. క్షేత్రజ్ఞుడిని. ఆ పరమాత్మ అంశను. నేను చూడవలసింది నశ్వరమైన క్షేత్రాన్ని (దేహాన్ని) కాదు, ఆ క్షేత్రంలో నా స్వరూపమే అయిన తండ్రిని. ఇట్టి క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానం ప్రసాదించిన గీతామాతకు    పూజ్యభావంతో ప్రణమిల్లుతున్నాను.

ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు

https://t.me/jaibhavaghni

లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ

జై గురుదేవ్

నామం 51: Bhagavad Gita: అనన్యభక్తి సారాంశం.. భగవంతునియందు నిశ్చల విశ్వాసం, నిరంతర ధ్యానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -51! 

నామం 50: Bhagavad Gita: నేను దేహం కాదని తెలిపే పరమజ్ఞానమే నిజమైన ఆత్మసాక్షాత్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -50! 

నామం 49: Bhagavad Gita: అపరా భక్తి మనసును స్థిరం చేస్తుంది, పరా భక్తి మనసును మోక్షానికి తీసుకెళ్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -49!

నామం 48: Bhagavad Gita: లౌకిక కార్యాలు కాదు.. ఆత్మజ్ఞానమే అసలైన సిద్ధి... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -48!

నామం 47: Bhagavad Gita: అవివేకాన్ని చెరిపి ఆత్మస్వరూపాన్ని జ్ఞాపకం చేసే గీతామాతకు నమస్కారం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -47!

నామం 46: Bhagavad Gita: శ్రీకృష్ణుని నోటివెంట జాలువారిన గీతామృతం.. మానవునికి మోక్ష మార్గం చూపే జ్ఞానరసాయనం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -46!

నామం 45: Bhagavad Gita: అమంగళం శాంతించు గాక... గీతా తత్వం జీవన సత్యంగా మారాలంటే.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -45!

నామం 44: Bhagavad Gita: హితకరమైన కోరికలతో జీవిస్తే ఫలితం తప్పదు.. గీతా సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -44!

నామం 43 : Bhagavad Gita: తామరాకును నీరు అంటక.. గీతాధ్యానం చేసేవారికి పాపం తగదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -43!

నామం 42 : Bhagavad Gita: ధర్మం మనలో ఉండాలి.. భగవద్గీతలోని సనాతన సూత్రాల సారాంశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -42!

నామం 41 : Bhagavad Gita: జననం మరణం అనివార్యం.. ఇది తెలిసినవాడు శోకించడు... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -41!

నామం 40 : Bhagavad Gita: అహం బ్రహ్మాస్మి.. మనిషి నుంచి పరమాత్మ వైపు ఆత్మయాత్ర.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 40!

నామం 39 : Bhagavad Gita: సంప్రదాయాలే ఆచారం.. శాస్త్ర విహిత కర్మాచరణ ద్వారానే మోక్ష సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -39!

నామం 38 : Bhagavad Gita : మంచినే చూడండి మంచినే వినండి.. అన్నిటిలో నేనే ఉన్నాను.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -38!

నామం 37 : Bhagavad Gita : ప్రేమలో ద్వేషానికి చోటు లేదు.. మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -37!

నామం 36 : Bhagavad Gita :సుఖం ఉన్నంత మాత్రాన శాంతి ఉండదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -36!

నామం 35 : Bhagavad Gita : బాహ్య సుఖం తాత్కాలికం ఆత్మసుఖమే నిత్యమైనది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -35!

నామం 34 : Bhagavad Gita : మరణ భయమే గొప్పది, కానీ జీవుడు దేహం కాదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -34!

నామం 33 : Bhagavad Gita : మనసులో శాంతి, మాటల్లో మృదుత్వం, కష్టాల్లో ఓర్పు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -33!

నామం 32 : Bhagavad Gita: సంసార మహాసాగరంలో విజయ మార్గం చూపే గీతామాత.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -32! 

నామం 31 : Bhagavad Gita: వైరాగ్యం అంటే రాగరహిత స్థితి.. దుఃఖానికి దూరమైన ఆత్మశాంతి మార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా31!

నామం 30 : Bhagavad Gita: కర్మ చేయడమే నీ అధికారం.. ఫలానికి కాదు.. గీతా బోధ.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -30!

Spotlight

Read More →