LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

TANA: అంగరంగ వైభవంగా తానా ఆస్టిన్ పాఠశాల ఆరవ వార్షికోత్సవం!

Telugu Association of North America (TANA): ఆస్టిన్‌లో తానా పాఠశాల ఆరవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చిన్నారుల ప్రతిభ, తెలుగు భాష పట్ల వారి ఆసక్తి ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో తానా పాఠశాల విద్యార్థులు కలిసి “బాల రామాయణం” నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శ…

AndhraPravasi News Desk 1 min read
TANA: అంగరంగ వైభవంగా తానా ఆస్టిన్ పాఠశాల ఆరవ వార్షికోత్సవం!

చిన్నారుల ప్రతిభతో మెరిసిన తానా ఆస్టిన్ వార్షికోత్సవం..

తెలుగు సంస్కృతికి అద్దం పట్టిన తానా పాఠశాల వేడుకలు..

ఆస్టిన్‌లో తానా పాఠశాల ఆరవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. చిన్నారుల ప్రతిభ, తెలుగు భాష పట్ల వారి ఆసక్తి ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో తానా పాఠశాల విద్యార్థులు కలిసి “బాల రామాయణం” నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ముఖ్యంగా పిల్లలు స్వయంగా తెలుగులో సంభాషిస్తూ రామాయణ పాత్రలను పోషించడం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. వారి సహజ నటనకు హాజరైన వారంతా మంత్రముగ్ధులయ్యారు.

ఈ వేడుకకు గౌరవ అతిథిగా నగర మేయర్ జిమ్ హాజరై, పిల్లల ప్రతిభను కొనియాడారు. ఉపాధ్యాయుల కృషిని ప్రశంసిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా విశ్వ గురుకులం “అంకురం” పాఠ్యపుస్తకాన్ని వ్యవస్థాపక సభ్యుడు రామ్ మారం విడుదల చేశారు. అనంతరం పాఠశాల మరియు విశ్వ గురుకులం విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

కార్యక్రమానికి పూర్వ విద్యార్థులైన నిహారిక భమిడిపాటి, రితిక గంగబత్తిన వ్యాఖ్యాతలుగా వ్యవహరించి కార్యక్రమాన్ని చక్కగా నడిపించారు. మరోవైపు, పూర్వ విద్యార్థులైన ద్విజేష్ గొంట్ల, సమయ సిద్ధాంత పొట్లచెరువు ఈ సంవత్సరం విద్యార్థులకు బోధించడం అందరికీ ఆదర్శంగా నిలిచింది.

పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్న కో-చైర్ రజని మారం, ఉపాధ్యాయులు అనూష చిట్టూరి, ప్రతూష అట్లూరి, శ్వేత వెలగలేటి, రాజేష్ గంగబత్తిన, శ్రీదేవి కోట, మృదుల కొనంకి, వాసవి కల్వతో పాటు విశ్వ గురుకులం ఉపాధ్యాయులు వంశీ భరద్వాజ్ ని తానా చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్, తానా ప్రెసిడెంట్ నరేన్ కొడాలి అభినందించారు.

కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన శ్రీనివాస్ లావు, శ్రీనివాస్ ఒరుగంటి, రాజా కసుకుర్తి, ఠాగూర్ మల్లినేని గారికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్షికోత్సవం పిల్లల్లో తెలుగు భాష, సంస్కృతి పట్ల ఆసక్తిని మరింత పెంచిన వేడుకగా నిలిచింది.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…