Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! Viral Deepfakes: వైరల్ అయిన AI మార్ఫ్‌డ్ ఫోటోలపై కీర్తి సురేష్ స్పందన... ఇది చాలా బాధగా, విసుగ్గా ఉంది!! వియత్నాంలో భారీ వరదలు.... 16 మంది మృతి! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!! Free AI: ఉచితంగా ఏఐ సబ్‌స్క్రిప్షన్లు ఎందుకు ఇస్తున్నారు..? కంపెనీల గ్రాండ్ స్ట్రాటజీ నిజాలు..! Welfare Schemes: సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడతను విడుదల చేసిన చంద్రన్న ప్రభుత్వం!! TTD Alert: విరాళాల పేరుతో భక్తులను వలలో వేసే మోసగాళ్లు..! టీటీడీ ఛైర్మన్ కీలక సూచనలు! Industries: ఏపీకి కొత్త పరిశ్రమలు.. ఆ 5 జిల్లాల్లో..! పలు రంగాలలో రికార్డు పెట్టుబడులు..! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! Viral Deepfakes: వైరల్ అయిన AI మార్ఫ్‌డ్ ఫోటోలపై కీర్తి సురేష్ స్పందన... ఇది చాలా బాధగా, విసుగ్గా ఉంది!! వియత్నాంలో భారీ వరదలు.... 16 మంది మృతి! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!! Free AI: ఉచితంగా ఏఐ సబ్‌స్క్రిప్షన్లు ఎందుకు ఇస్తున్నారు..? కంపెనీల గ్రాండ్ స్ట్రాటజీ నిజాలు..! Welfare Schemes: సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీభవ రెండో విడతను విడుదల చేసిన చంద్రన్న ప్రభుత్వం!! TTD Alert: విరాళాల పేరుతో భక్తులను వలలో వేసే మోసగాళ్లు..! టీటీడీ ఛైర్మన్ కీలక సూచనలు! Industries: ఏపీకి కొత్త పరిశ్రమలు.. ఆ 5 జిల్లాల్లో..! పలు రంగాలలో రికార్డు పెట్టుబడులు..!

Electric Vehicle: ఈవీ ప్రయాణాలకు ఇక టెన్షన్ లేదు! ఏపీలో 500 కొత్త ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు!

2025-11-20 13:18:00
Ibomma ravi: కోచింగ్ సెంటర్‌లో ప్రేమ… చివరకు విడాకుల దాకా రవి కథ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని మరింతగా పెంచేందుకు కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఇటీవలి సంవత్సరాల్లో ఈవీ వాహనాల డిమాండ్‌ గణనీయంగా పెరిగినా, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కొరత పెద్ద అడ్డంకిగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ హైవేల వెంట ప్రతి 30 కిలోమీటర్లకో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రణాళికను నెడ్‌క్యాప్ (NEDCAP) సమన్వయం చేస్తోంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ సర్వోటెక్ సంస్థ ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావడానికి ముందుకు వచ్చింది. పెట్రోల్ బంకులు, స్టార్ హోటళ్లలో అన్ని రకాల ఈవీలకు అనువైన అధునాతన ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి.

Smart Phone: చైనా బ్రాండ్స్‌కి దిమ్మతిరిగే షాక్! అతి తక్కువ ధరకే అద్భుత ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్..!

సర్వోటెక్ ఏర్పాటు చేయనున్న ఈ ఛార్జింగ్ స్టేషన్లు 30 కిలోవాట్ల నుంచి 360 కిలోవాట్ల వరకు విభిన్న సామర్థ్యాలతో ఉండనున్నాయి. అందుబాటులో ఉన్న స్థలం, ట్రాఫిక్ వాల్యూం, స్థానిక అవసరాలను బట్టి ప్రతి స్టేషన్ సామర్థ్యం నిర్ణయిస్తారు. ఈ స్టేషన్ల ఏర్పాటుకు ARAI, ICAT వంటి జాతీయ ప్రమాణీకరణ సంస్థల ఆమోదం తప్పనిసరి. మొత్తం 500 కొత్త ఛార్జింగ్ కేంద్రాలను ఇండియన్ ఆయిల్, హెచ్‌పీ, బీపీసీఎల్ పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న 601 స్టేషన్లు 1.8 లక్షల ఈవీల డిమాండ్‌ను తీర్చలేకపోతుండటంతో, ముఖ్యంగా లాంగ్ జర్నీలలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కొత్త నెట్‌వర్క్ అవసరమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Delhis suffocating: ఢిల్లీకి ఊపిరాడనీయని పొగమంచు.. వాహనాలు, స్టబుల్ బర్నింగ్ ప్రధాన కారణం!

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 205 కిలోమీటర్లకు ఒక్క ఛార్జింగ్ స్టేషన్ మాత్రమే ఉండటం వల్ల డ్రైవర్లు ప్రయాణ మధ్యలో స్టేషన్లు దొరకక ఆందోళన చెందుతున్నారు. దీనికి చెక్ పెట్టే ప్రయత్నంగానే ప్రభుత్వం ఈ మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టి పెట్టింది. నెడ్‌క్యాప్ ఆధ్వర్యంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా, పర్యావరణహిత రవాణా ప్రోత్సాహానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో ఇది కీలకమైన అడుగు కానుందనే అంచనాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఈవీ దత్తత (EV adoption) రేటు పెరుగుతుండడంతో భవిష్యత్తులో ఛార్జింగ్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆధునాతన ఛార్జింగ్ స్టేషన్ నెట్‌వర్క్ నిర్మాణం అత్యవసరమైంది.

Free Trainig: AP యువతకు గోల్డెన్ ఛాన్స్... వారికి ఉచిత AI, టాలీ శిక్షణ..! లింకుతో సహా పూర్తి వివరాలు!

కొత్తగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలనుకునే వారికి ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ప్రకటించింది. మొదటి 5 వేల స్టేషన్లకు మూలధన పెట్టుబడిలో 25 శాతం వరకు సబ్సిడీ ఇవ్వనున్నారు. అయితే ఈ ఆర్థిక సహాయం గరిష్టంగా ₹3 లక్షల వరకే పరిమితం. తద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపారులు కూడా ఈవీ ఛార్జింగ్ వ్యాపారంలో ప్రవేశించేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేస్తోంది. స్థాపన గైడ్‌లైన్లు, అనుమతులు, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలను సరళతరం చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్ట్‌ అమలు వివరాలు, టైమ్‌లైన్ పై త్వరలో పూర్తి స్పష్టత రానుంది.

అలిపిరి శ్రీనివాస టిక్కెట్లు 10 రోజుల పాటు రద్దు! అదే కారణం!
ఉద్దానం కిడ్నీ సమస్యలపై ICMR కీలక నిర్ణయం! రూ.6.2 కోట్ల పరిశోధనకు ఆమోదం!
Ibomma: ఐబొమ్మ' దందా బ్రేక్.. విదేశాల నుంచి కార్యకలాపాలు సాగించిన పైరసీ ముఠా అధినేత అరెస్ట్! 50 లక్షల యూజర్ల డేటా స్వాధీనం!
Jio Bumper Offer: జియో బాంపర్ ఆఫర్.. 18 నెలలు ఫ్రీగా గూగుల్ జెమినీ AI ప్రో ప్లాన్!
మళ్లీ బారీగా పెరిగిన బంగారం ధరలు! నేడు పది గ్రాముల ధర ఎంతంటే!
India-US: భారత్-అమెరికా రక్షణ బంధం..! మిలియన్లతో జావెలిన్, ఎక్స్‌కాలిబర్ కొనుగోలుకు అమెరికా గ్రీన్ సిగ్నల్!

Spotlight

Read More →