Germany Jobs: జర్మనీలో భారీ ఉద్యోగ అవకాశాలు! వసతి, వీసా, ఫ్లైట్ ఫ్రీ... దరఖాస్తు వివరాలు! Mega PT Meeting: చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్! Putin India Visit: మోదీ–పుతిన్ ఒకే కారులో ప్రయాణం… అందరి దృష్టి ఆ కారుపైనే!! ఒక్కరోజే 92 విమానాల రద్దు - శంషాబాద్‌లో రణరంగం! నిరసనలతో దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్! కేంద్ర మంత్రికి ఫోన్.. Travel News:ఇండిగో విమాన సర్వీసుల అంతరాయం… టికెట్ ధరలు చూసి షాక్ అవుతున్న ప్రయాణికులు! శ్రీశైలం డ్యాంకు పొంచి ఉన్న పెను ప్రమాదం.. రెండు రాష్ట్రాల ప్రజల ఆందోళన! AQI Levels: భారత్‌లో తక్కువ కాలుష్యం ఉన్న నగరాలు! గాలి నాణ్యతకు ప్రధాన కారణాలు... RBI: వడ్డీ రేటు తగ్గించిన ఆర్‌బీఐ…! ఆ రుణదారులకు భారీ ఊరట..! Gold–Rupee Shock: ఆర్బీఐ పాలసీకి ముందే పసిడి డిప్… రూపాయి కౌంటర్ అటాక్! రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం! భారత్–రష్యా స్నేహబంధానికి నేడు కొత్త అధ్యాయం! Germany Jobs: జర్మనీలో భారీ ఉద్యోగ అవకాశాలు! వసతి, వీసా, ఫ్లైట్ ఫ్రీ... దరఖాస్తు వివరాలు! Mega PT Meeting: చిలకలూరిపేటలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్! Putin India Visit: మోదీ–పుతిన్ ఒకే కారులో ప్రయాణం… అందరి దృష్టి ఆ కారుపైనే!! ఒక్కరోజే 92 విమానాల రద్దు - శంషాబాద్‌లో రణరంగం! నిరసనలతో దద్దరిల్లిన ఎయిర్‌పోర్ట్! కేంద్ర మంత్రికి ఫోన్.. Travel News:ఇండిగో విమాన సర్వీసుల అంతరాయం… టికెట్ ధరలు చూసి షాక్ అవుతున్న ప్రయాణికులు! శ్రీశైలం డ్యాంకు పొంచి ఉన్న పెను ప్రమాదం.. రెండు రాష్ట్రాల ప్రజల ఆందోళన! AQI Levels: భారత్‌లో తక్కువ కాలుష్యం ఉన్న నగరాలు! గాలి నాణ్యతకు ప్రధాన కారణాలు... RBI: వడ్డీ రేటు తగ్గించిన ఆర్‌బీఐ…! ఆ రుణదారులకు భారీ ఊరట..! Gold–Rupee Shock: ఆర్బీఐ పాలసీకి ముందే పసిడి డిప్… రూపాయి కౌంటర్ అటాక్! రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం! భారత్–రష్యా స్నేహబంధానికి నేడు కొత్త అధ్యాయం!

Railway Zone: ఏపీలో మరో కొత్త రైల్వే డివిజన్.. తిరుమల శ్రీవారి పేరుతో..! కేంద్రం కీలక నిర్ణయం..!

2025-12-05 09:44:00
Corruption Blast: సర్వే ఏడీ చేతిలో కోట్ల విలువైన ఆస్తులు..! మరిన్ని రహస్యాల వెలుగులోకి..!

తిరుపతిని కేంద్రంగా చేసుకుని బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుపై దశాబ్దాలుగా కొనసాగుతున్న డిమాండ్ మరోసారి తెరపైకొచ్చింది. ఈ ప్రతిపాదనను త్వరితగతిన అమలు చేయాలంటూ టీడీపీ ప్రజాప్రతినిధులు, బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి సభ్యులు ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తిరుపతి రైల్వే స్టేషన్ ప్రతి ఏటా భారీగా ఆదాయం ఆర్జిస్తున్నప్పటికీ, ప్రస్తుత అధికార పరిధి కారణంగా ఈ ప్రాంత రైల్వే అభివృద్ధి, సేవల విస్తరణలో అడ్డంకులు ఎదురవుతున్నాయని వారు వివరించారు. ఈ సందర్భంగా పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావులు కీలకపాత్ర పోషించారు.

PutinIndiaVisit: పుతిన్‌ భారత్‌ పర్యటన రెండో రోజు.. వాటిపైనే కీలక ఒప్పందాలు!!

వినతిపత్రంలో తిరుపతి రైల్వే స్టేషన్ దేశంలో అత్యంత రద్దీ పుణ్యక్షేత్రంగా నిలుస్తోందని, సంవత్సరం వారీగా రూ.250 కోట్లకు పైగా ఆదాయం ఆర్జిస్తూ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో మూడో స్థానంలో ఉందని గుర్తు చేశారు. అయినప్పటికీ విశాఖపట్నంలో ఉన్న సౌత్ కోస్టు రైల్వే జోన్ హెడ్‌క్వార్టర్స్, అమరావతి ప్రాంతంలోని విజయవాడ–గుంటూరు డివిజనల్ కార్యాలయాలు రాయలసీమ నుంచి ఎంతో దూరంలో ఉండటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారం మందగిస్తోందని వారు వివరించారు. ఈ ప్రాంతానికి సమీపంలో ప్రత్యేక డివిజనల్ కార్యాలయం లేకపోవడం వల్ల తిరుపతి–రేణిగుంట–కడప స్థలాలకు సంబంధించిన ట్రాఫిక్, అభివృద్ధి అవసరాలు నెరవేర్చడం కష్టమైందన్నారు.

AP Medical: విద్యార్థులకు బిగ్ అప్‌డేట్! కొత్త 5 మెడికల్ కళాశాలల్లో పీజీ ఫీజుల ఖరారు…!

తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు చేస్తే, దక్షిణ రాయలసీమకు సంబంధించిన రైల్వే అవసరాలు వేగంగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని ప్రతినిధులు స్పష్టం చేశారు. స్థానిక ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైలు సేవలను విస్తరించడంలో, కొత్త స్టేషన్ల అభివృద్ధిలో, ప్యాసింజర్ అమెనిటీస్ మెరుగుపరచడంలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుందన్నారు. ఈ కొత్త డివిజన్‌లో తిరుపతి–ఒంగోలు, తిరుపతి–కాట్పాడి, పాకాల–ధర్మవరం, రేణిగుంట–ఎర్రగుంట్ల, ఎర్రగుంట్ల–నంద్యాల, శ్రీకాళహస్తి–నడికుడి, ఓబుళవారిపల్లె–కృష్ణపట్నం, కడప–బెంగళూరు వంటి కీలక రూట్లలోని మొత్తం 1,550 కిలోమీటర్ల రైల్వే లైన్లు ఉండేలా ప్రతిపాదించారు. ఇవి తిరుపతిని ఒక ప్రధాన డివిజనల్ నాడిగా నిలబెట్టే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.

USWorkPermit: అమెరికా వర్క్ పర్మిట్ రూల్స్ కఠినం… విదేశీ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ట్రంప్ !!

బాలాజీ రైల్వే డివిజన్ ప్రతిపాదన చాలా ఏళ్లుగా ముందుకు రాకుండా పెండింగ్‌లో ఉంది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం, పలు సార్లు ఆమోద దశలోనే ఆగిపోవడం వల్ల ఈ డిమాండ్ నిలిచిపోయింది. తాజాగా మళ్లీ దీనిపై చర్చలు ప్రారంభం కావడం ఆసక్తికరంగా మారింది. ఈసారి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తీరు, కేంద్రం స్పందనతో ఈ ప్రతిపాదన వాస్తవ రూపం దాల్చుతుందా? లేక మరొకసారి పేపర్లకే పరిమితమవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. రాయలసీమ ప్రజల దీర్ఘకాల కోరిక నెరవేరే అవకాశంపై ఇప్పుడు అందరి చూపు కేంద్రంపై నిలిచింది.

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు... ఎప్పుడైనా అమ్ముకోవచ్చు!
International News: డోన్బాస్‌పై పుతిన్ హెచ్చరిక... శాంతి చర్చలకు బ్రేకేనా?
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్! టీటీడీ స్థానిక ఆలయాల్లో కూడా ఇక నుండి...!!
Akhanda2: అఖండ 2కి బ్రేక్! ఆఖరి నిమిషంలో ఏమైంది? రిలీజ్ అప్‌డేట్ ఎప్పుడంటే!!
Diabetes Awareness: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. షుగర్​ పరీక్ష చేయించాల్సిందే!!
Vijayawada Flights: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న విమాన ఛార్జీల భారం! విజయవాడకు కొత్త సర్వీసులు!

Spotlight

Read More →