అఖండ మొదటి భాగం విడుదలైనప్పుడు తెలుగు సినీ ప్రేక్షకులకు పూనకాలు వచ్చేయన్ని చెప్పుకోవాలి . బాలకృష్ణ అఘోర వేషంలో తెరపై కనిపించిన తీరు బోయపాటి శ్రీను తీసిన ఆధ్యాత్మిక శైలి యాక్షన్, బ్యాక్‌గ్రౌండ్ సంగీతం కలిసి ఆ సినిమాను ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లాయి. థియేటర్లలో పలుమార్లు చూడాలనిపించే చిత్రంగా అఖండ నిలిచింది. ప్రేక్షకుల అభిమానమే కాదు, ఫ్యాన్స్‌లో ఒక ప్రత్యేక భావోద్వేగాన్ని కూడా ఆ సినిమా సృష్టించింది. అందుకే సీక్వెల్‌పై ప్రేక్షకులలో భారీ అంచనా పెరిగిందని చెప్పుకోవాలి.
ఇటువంటి తరుణంలో అఖండ 2 గురించి వచ్చిన తాజా సమాచారం అభిమానులకు పెద్ద నిరాశను మిగిల్చింది. అనివార్య కారణాల వల్ల సినిమా ముందుగా ప్రకటించిన తేదీన విడుదల కావడం లేదని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. “మా హృదయం భారమవుతోంది… సినిమా నిర్ణయించిన తేదీన థియేటర్లకు రాలేకపోవడం మాకు కూడా అత్యంత బాధాకరం అని చిత్రబృందం X వేదిక ద్వారా ట్విట్టర్ వేదిక ద్వారా తెలిపారు. ఇప్పటికే ట్రైలర్, పాటలు విడుదల కావడంతో సీక్వెల్‌పై ఉత్సాహం అత్యున్నత స్థాయిలో ఉందని చెప్పాలి.
ప్రత్యేకంగా బాలకృష్ణ అభిమానులు ఈ సినిమా కోసం భారీగా సిద్ధమవుతుండగాష ఈ వాయిదా వార్త వారిలో నిరాశను కలిగించింది. సినిమా నిర్మాణ బృందం మాట్లాడుతూ “ప్రతి అభిమాని, ప్రతి సినీ ప్రేమికుడు ఈ రోజుకై ఎంతగా ఎదురుచూస్తున్నాడో మాకు తెలుసు. కానీ కొన్ని పరిస్థితులు మా నియంత్రణలో ఉండవు. వాటిని త్వరగా పరిష్కరించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం” అని వివరించింది. చిత్రబృందం ఇచ్చిన ఈ స్పష్టీకరణతో అభిమానులు పరిస్థితిని అర్థం చేసుకున్నా, సినిమా ఎప్పుడు విడుదలవుతుందన్న ఆసక్తి మాత్రం అలాగే ఉంది.
ఇప్పటికే పోస్టర్‌ల నుంచి చిన్న ప్రమోషనల్ వీడియోల వరకూ అన్నీ అఖండ 2 పై అంచనాలను మరింత పెంచాయి. సినిమాలోని ఆధ్యాత్మిక థీమ్, భారీ యాక్షన్, బాలకృష్ణ నటనపై నమ్మకం వీటన్నింటి సమ్మేళనం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని కలిగించింది. అందుకే విడుదల వాయిదా పడటం సినిమా హంగామాకు తాత్కాలిక బ్రేక్ వేసింది.
చిత్రబృందం మరోసారి క్షమాపణలు తెలుపుతూ, “మీ మద్దతు మాకు ఎంతో విలువైనది. ఈ సమస్య త్వరగా పరిష్కారమవుతుందని మేము నమ్ముతున్నాం. చాలా త్వరలో ఒక సానుకూల అప్‌డేట్‌ను పంచుకోగలుగుతాం” అని తెలిపింది. అధికారిక విడుదల తేదీపై కొత్త సమాచారం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
మొత్తం మీద, అఖండ 2 విడుదల వాయిదా వార్త సినీప్రియులను నిరుత్సాహపరిచినా సినిమా మీద ఉన్న నమ్మకం తగ్గలేదు. విడుదల ఎప్పుడు జరిగినా థియేటర్లలో భారీ స్పందన రావడం ఖాయం.