LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
NRI

Israel Iran War 2026: హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ కీలక ప్రకటన.. యుద్ధనౌకలు పంపాలని మిత్రదేశాలకు పిలుపు!

Israel Iran War 2026: హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల సాయం కోరారు. ఇరాన్ కీలక చమురు కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్‌పై అమెరికా దాడులు చేయడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 100 డాలర్ల మార్కును దాటాయి..

AndhraPravasi News Desk 2 min read
Israel Iran War 2026: హోర్ముజ్ జలసంధిపై ట్రంప్ కీలక ప్రకటన.. యుద్ధనౌకలు పంపాలని మిత్రదేశాలకు పిలుపు!

ఖార్గ్ ఐలాండ్‌పై బాంబుల వర్షం

అల్లాడుతున్న గల్ఫ్ దేశాలు

మండిపోతున్న పెట్రోల్ ధరలు

Israel Iran War 2026: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత భయంకరంగా మారుతున్నాయి. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే కీలకమైన 'హోర్ముజ్ జలసంధి'ని తిరిగి తెరిపించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నడుం బిగించారు. ఇరాన్ తీరానికి సమీపంలో ఉన్న ఈ మార్గం ద్వారా వ్యాపార నౌకలు సురక్షితంగా వెళ్లేలా చూడటానికి యుద్ధనౌకలను పంపాలని ఆయన మిత్ర దేశాలకు పిలుపునిచ్చారు. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా  బ్రిటన్ వంటి దేశాలు తమ నౌకలను పంపి అమెరికాకు సహకరించాలని ఆయన కోరారు.

కొద్ది గంటల ముందే ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్‌లోని సైనిక స్థావరాలపై అమెరికా దాడి చేసింది. ఆ ద్వీపంలోని సైనిక వసతులు పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ ప్రకటించారు. అయితే, మానవతా దృక్పథంతో చమురు శుద్ధి కర్మాగారాల జోలికి వెళ్లలేదని, ఒకవేళ ఇరాన్ గనుక నౌకల రాకపోకలను అడ్డుకుంటే వాటిని కూడా వదలబోమని ఆయన హెచ్చరించారు. ఇరాన్ తీర ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.

మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తమ శత్రువులకు మాత్రమే ఈ మార్గాన్ని మూసివేస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ ప్రకటించారు. తాజాగా ఐక్య అరబ్ ఎమిరేట్స్ (UAE) పై డ్రోన్ దాడులు జరిగాయి. ఫుజైరా పోర్టులో చమురు లోడింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. దుబాయ్‌లోని కొన్ని భవనాలపై క్షిపణి శకలాలు పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఈ యుద్ధం కారణంగా సుమారు 3,750 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

ఈ యుద్ధం ప్రభావం ప్రపంచ మార్కెట్‌పై గట్టిగా పడింది. అంతర్జాతీయంగా ముడి చమురు  ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటేసింది. హోర్ముజ్ జలసంధి మూతపడటంతో సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ వంటి దేశాలు ఉత్పత్తిని తగ్గించక తప్పలేదు. దీనివల్ల సామాన్యులపై పెట్రోల్ భారం పడే అవకాశం ఉంది. అమెరికాలో కూడా గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకడంతో ట్రంప్ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి మాత్రం ఇది "విజయ దశ" లో ఉందని అంటుండగా, ఇరాన్ మాత్రం తన దాడులను తీవ్రం చేస్తోంది. జోర్డాన్, ఇరాక్ వంటి దేశాల్లో కూడా క్షిపణులు పడుతుండటంతో మధ్యప్రాచ్యం మొత్తం నిప్పుల కుంపటిలా మారింది. ఈ ఉద్రిక్తతలు తగ్గకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Be the first to react

More Coverage

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: టీ‌సీఏ స్వర్ణోత్సవ వేడుకలకు నృత్య కళాకారుల ఆహ్వానం.. ‘స్వాగత గీతం’, ‘స్వర్ణ వైభవం’ కోసం దరఖాస్తుల స్వీకరణ!

TCA: అమెరికాలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమి…