ప్రజల సమస్యలను మంత్రులు, రాష్ట్ర, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు" అని ఆయన అన్నారు. అంతేకాకుండా జిల్లా అధికారులు ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వడం లేదని, గంటల తరబడి ఎదురుచూసేలా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలపై విజ్ఞప్తులు చేసినా మంత్రులు, అధికారులు పట్టించుకోవడం లేదని, కనీసం సమాధానం కూడా ఇవ్వడం లేదని ఆయన ప్రభుత్వానికి తెలిపారు. ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. దీనిపై స్పందించిన సి.ఎస్ విజయానంద్ అధికారులు, జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మర్యాదలు సక్రమంగా జరగాలని ప్రభుత్వం ఆదేశించింది.
2012లో జారీ చేసిన జీవో నెం.348లోని మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. ఈ జీవోలో వీవీఐపీలు, వీఐపీలకు ప్రొటోకాల్ ఎలా పాటించాలో స్పష్టంగా పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇచ్చిన విజ్ఞాపనలపై వెంటనే స్పందించాలని, వారు అడిగిన సమాచారాన్ని వెంటనే ఇవ్వాలని ఆయన సూచించారు. అంతేకాకుండా వారితో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు వెంటనే సమయం కేటాయించాలని ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయగలరని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం మరో బంపరాఫర్..! ఏకంగా రూ. వేలకోట్ల ప్రాజెక్టు ఆ జిల్లాకే పక్కా..!
కొన్ని ముఖ్యమైన సూచనలు:
ప్రజాప్రతినిధులతో సత్వరం ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం.
వారి వినతులు మరియు లేఖలను వెంటనే స్వీకరించి పరిష్కరించడం.
వారు కోరిన సమాచారాన్ని సత్వరం అందించడం.
వారిని మర్యాదగా కలవడం, తగిన ప్రాధాన్యత ఇవ్వడం.
వారి ఫోన్ కాల్స్‌కు వెంటనే స్పందించడం.
సమావేశాల్లో వారికి ప్రత్యేక స్థానం కల్పించడం.
ప్రభుత్వ కార్యక్రమాలకు వారిని తప్పకుండా ఆహ్వానించడం.
ఈ ఆదేశాలను ఏ అధికారి ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలని.. ఈ విషయంలో ఎలాంటి లోటుపాట్లు జరగకూడదు అన్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త ఆర్వోబీ..! ఆ రూట్లోనే.. తీరనున్న దశాబ్ద కల..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..
ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!
వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..
చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..
ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!
విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!
బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!
పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!
హైదరాబాద్ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: