పాకిస్థాన్‌తో జరిగిన పోరులో అసువులు బాసిన వీర జవాన్ మురళీనాయక్ భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామానికి తరలించారు. మురళీనాయక్ పార్థివ దేహాన్ని ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో మొదట బెంగళూరు విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శనివారం రాత్రి శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్లితండాకు తరలించారు. సైనికాధికారులు మురళీనాయక్ పార్థివదేహాన్ని ఆయన తల్లిదండ్రులు శ్రీరామనాయక్, జ్యోతిబాయిలకు అప్పగించారు. వీర జవాన్ అంత్యక్రియలు ఈరోజు గ్రామంలో అధికార, సైనిక లాంఛనాలతో జరుగుతాయి. ఈ అంత్యక్రియలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ తదితరులు హాజరై నివాళులర్పించనున్నారు. మురళీనాయక్ అంత్యక్రియలకు ప్రముఖులు కళ్లితండాకు విచ్చేయనుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు విమానాశ్రయం వద్ద మురళీనాయక్ పార్థివదేహంతో ప్రారంభమైన ర్యాలీ రాత్రి 9.30 గంటల వరకు కొనసాగింది. మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమరవీరుడికి శ్రద్ధాంజలి ఘటించారు.
ఇది కూడా చదవండి: చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..
ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!
విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!
బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!
పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!
హైదరాబాద్ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: