Header Banner

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

  Sun May 11, 2025 11:20        Politics

కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని మోసగించిన కేసులో వైకాపా నాయకుడు, మాజీ మంత్రి విడదల రజిని వ్యక్తిగత సహాయకుడు మానుకొండ శ్రీకాంత్రెడ్డిని పల్నాడు జిల్లా చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రజిని పోలీసు విధులకు తీవ్ర ఆటంకం కలిగించారు. శ్రీకాంత్ అరెస్టును అడ్డుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. తన కారులోనే స్టేషన్కు తీసుకొచ్చి అప్పగిస్తానని పట్టుబట్టారు. మధ్యాహ్న భోజన పథకంలో ప్రభుత్వ పాఠశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసే ఏజెన్సీ ఇప్పిస్తానని విడదల రజిని ప్రధాన అనుచరుడు శ్రీకాంత్రెడ్డి వైకాపా హయాంలో తన దగ్గర రూ.28 లక్షలు తీసుకుని, మోసగించాడని చిలకలూరిపేటకు చెందిన మున్నంగి రత్నారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 41ఏ నోటీసులిచ్చి స్టేషన్కు పిలిచినా రాకుండా పరారయ్యాడంటూ పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాదెండ్ల మండలం జంగాలపల్లిలో వైకాపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ మంత్రి విడదల రజిని వస్తున్నారని, అదే కారులో శ్రీకాంత్రెడ్డి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది.

 

ఇది కూడా చదవండి: ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు, ఎస్సై పుల్లారావు జంగాలపల్లి వెళ్లారు. మోసం కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్రెడ్డిని తమకు అప్పగించాలని విడదల రజినిని కోరారు. శ్రీకాంత్ కారులో లేడని ఆమె సమాధానమిచ్చారు. ఉన్నాడో లేడో చూస్తామని సీఐ చెప్పగా కుదరదంటూ అడ్డుకున్నారు. మీరు పక్కకు వెళ్లండి.. కారులో లేకపోతే వెళ్లిపోతామని చెప్పినా ఆమె వినలేదు. 'సీఐ గారు ఏంటిది' అంటూ రజిని పోలీసుల్ని పదేపదే అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. శ్రీకాంత్రెడ్డిని అప్పగించేది లేదని వాదించారు. తన కారులోనే తీసుకొస్తానని వాదించడంతో చేసేది లేక యడ్లపాడు వరకు రజిని కారులోనే శ్రీకాంత్రెడ్డిని అనుమతించారు. యడ్లపాడు స్టేషన్లో శ్రీకాంత్రెడ్డిని పోలీసులకు అప్పగించి రజిని వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నరసరావుపేట వన్టైన్ పోలీస్ స్టేషన్లో నమోదయిన కేసులో శ్రీకాంత్రెడ్డి ఏ2గా ఉన్నారు. ఆ కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.

 

ఇది కూడా చదవండి: చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VidadalaRajini #YCP #AndhraPradesh #APpolitics #Chilakaluripet