ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రాముఖ్యమైన మాస్టర్ ప్లాన్‌తో ముందుకొస్తోంది. సముద్రయాన రంగాన్ని అభివృద్ధి చేయడానికి విశిష్ట ప్రాజెక్ట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సూచనాత్మకంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టు అమలుకు సుమారు రూ.3,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. కేంద్ర నౌకాయానశాఖ మంత్రి సర్పానంద సోనోవాల్ ఆధ్వర్యంలో ఒక బృందం మంగళవారం రాష్ట్రానికి రానుంది. వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమై ప్రాజెక్టు వివరాలపై చర్చించనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నౌకల మరమ్మత్తుల కోసం సరైన మౌలిక సదుపాయాలు లేవు. ఈ కారణంగా కొచ్చిన్ (కేరళ), ముంబై (మహారాష్ట్ర), గుజరాత్ ప్రైవేటు షిప్ యార్డులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 300 నౌకలు రీసైక్లింగ్ కోసం వస్తున్నాయనే అంచనాతో, రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా షిప్ మరమ్మత్తు కేంద్రం, రీసైక్లింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది.
ఏపీ తూర్పు తీరంలో విశాఖపట్నం మేజర్ పోర్టు, గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ, రవ్వ వంటి ప్రధాన పోర్టులతో పాటు, కొత్తగా మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టులు అభివృద్ధిలో ఉన్నాయి. అలాగే, 10 చేపల రేవులు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి నిర్వహణకు అనువుగా షిప్ బ్రేకింగ్ యూనిట్ దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
అంతేకాకుండా, విభజన చట్టం ప్రకారం కేంద్రం దుగరాజపట్నంలో ఓడరేవు నిర్మించాల్సిన బాధ్యత ఉంది. అయితే, ప్రస్తుతానికి ఓడరేవు అవసరం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర అనుమతి కోరింది.
ఈ ప్రాజెక్టు పర్యావరణానికి ఎలాంటి భయంకర ప్రభావం ఉండదని ఫీజిబిలిటీ నివేదిక వెల్లడించింది. ఈ ప్రాంతంలో మునుపే ఓడరేవు ఉండేదని, నౌకల రాకపోకలకు అనువైనదని పేర్కొంది. పులికాట్ సరస్సు, శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం వంటి సమీప ప్రాంతాలపై ప్రభావం లేకుండా నిర్మాణాలను చేపట్టవచ్చని నివేదిక స్పష్టం చేసింది. ఈ అంశాలపై అధికారులు మంగళవారం చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..
ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!
వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..
చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..
ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!
విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!
బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!
పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!
హైదరాబాద్ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: