సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ముందుగానే చెప్పినట్లుగా.. మే నెలలోనే రైతుల అకౌంట్లలోకి అన్నదాత సుఖీభవ డబ్బులను జమ చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే.. అంటే ఈ నెలాఖరు నాటికి అన్నదాత సుఖీభవ డబ్బులను ఇస్తామని అన్నారు. డైరెక్టుగా అకౌంట్లలోకే మనీని జమ చేస్తామని తెలిపారు. ఈ శుభవార్తను సీఎం చంద్రబాబు.. xలో ట్వీట్ ద్వారా తెలిపారు. రైతులకు మనీ ఇచ్చే విషయమై అధికారులు.. ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టారు అని చంద్రబాబు తెలిపారు. సీఎం చంద్రబాబు మరో ఆసక్తికర విషయం చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని వెబ్‌లాండ్‌కి లింక్ చేశామని తెలిపారు. ఇలా లింక్ చెయ్యడం వల్ల అర్హులైన రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయి. అర్హులు కానివారికి డబ్బులు రావు. అర్హులు కాని వారు ఎవరు అంటే.. మరణించినవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్ పొందేవారు, ఆదాయపు పన్ను చెల్లించేవారు. వీరెవరికీ అన్నదాత సుఖీభవ డబ్బులు రావు. ఎందుకంటే.. ఈ పథకం పేద రైతులను ఆదుకోవడానికి తెచ్చినది మాత్రమే. ప్రస్తుతం వెబ్‌లాండ్ ద్వారా.. అర్హులైన రైతులను గుర్తిస్తున్నారు. వారి పూర్తి వివరాల్ని నమోదు చేస్తున్నారు. అలాగే.. అర్హులు కాని రైతుల పేర్లను రెవెన్యూ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. వెబ్‌లాండ్‌లో పూర్తి వివరాలు ఉంటున్నాయి. వాటిని ప్రతీ గ్రామంలో వ్యవసాయ అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఏకంగా రూ.70 లక్షల లంచం...! ఐఆర్ఎస్ అధికారిని అరెస్ట్ చేసిన సీబీఐ!
రైతు పేరు, సర్వే నంబర్లు, పొలం విస్తీర్ణం ఇలా ప్రతీదీ లెక్కల ప్రకారం ఉన్నాయి. అందువల్ల అర్హులైన రైతులకు కచ్చితంగా మనీ జమ అవుతుంది. కొంత మంది రైతులకు.. తమకు డబ్బు వస్తుందా రాదా అనే డౌట్ రావచ్చు. వారు రైతు సేవా కేంద్రానికి వెళ్లి.. తమ పేరును అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాలో చేర్చమని కోరవచ్చు. ఆల్రెడీ చేర్చి ఉంటే, ఏ సమస్యా ఉండదు. చేర్చి లేకపోతే, అప్పుడు రైతు సేవా కేంద్రాల్లోని సహాయకులు.. పరిశీలిస్తారు. పేరు చేర్చేందుకు ఏయే పత్రాలు కావాలో చెబుతారు. ఆ పత్రాలను వారికి చూపించి, పేరు నమోదు చేయించుకోవచ్చు. సాధారణంగా పీఎం కిసాన్ పొందుతున్న రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా వస్తాయి. ఏవైనా సమస్యలు ఉంటే.. జిల్లా వ్యవసాయ అధికారులు పరిశీలించి, మళ్లీ కింది స్థాయిలో వ్యవసాయ అధికారులను మరోసారి చెక్ చెయ్యమని చెబుతారు. ఇలా.. ఈ పనంతా.. ఈ నెలాఖరు లోపు పూర్తైపోతుంది. రైతు సేవా కేంద్రాల్లో సహాయకులు మే 20 లోగా.. పూర్తి వివరాల్ని ఇంటర్నెట్ ద్వారా వెబ్‌లాండ్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత 10 రోజుల్లో అధికారులు కూడా అన్నీ చెక్ చేస్తారు. నెలాఖరున డబ్బులు జమ అవుతాయి. ఇదివరకు వైసీపీ ప్రభుత్వం వెబ్‌లాండ్ డేటా ఆధారంగా రైతులకు రైతు భరోసా ఇచ్చింది. ఐతే.. ఆ డేటాలో లోపాలు ఉన్నాయని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంటోంది. అందువల్ల రైతు భరోసా అందుకున్న రైతులందరికీ అన్నదాత సుఖీభవ డబ్బు వస్తుంది అనే గ్యారెంటీ లేదు. అందుకే రైతులు ఓసారి రైతు సేవా కేంద్రానికి వెళ్లి.. తమ పేరును ఉంచారో, తీసేశారో తెలుసుకుంటే మంచిదే. చివరి నిమిషంలో ఇబ్బంది పడే కంటే.. ముందు నుంచే జాగ్రత్త పడటం మేలు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ విడత డబ్బును జూన్ నెలలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో సంబంధం లేకుండా.. ఏపీ ప్రభుత్వం మే నెలలోనే మనీ ఇవ్వాలి అనుకుంటోంది. ఈ సంవత్సరం నైరుతీ రుతుపవనాలు కూడా త్వరగానే వస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!
విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!
బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!
పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!
హైదరాబాద్ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: