ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న 'తల్లికి వందనం' పథకం ద్వారా, రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రతి ఏడాది రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా, తల్లులకు ఆర్థికంగా సాయం చేయడమే లక్ష్యంగా ఉంది. అయితే, ఈ పథకం ద్వారా డబ్బులు అందుకోవాలంటే తల్లులు తప్పనిసరిగా హౌస్ హోల్డ్ డేటాబేస్‌లో పిల్లల వివరాలు నమోదు చేయాలి, ఈ-కేవైసీ పూర్తి చేయాలి, అలాగే తల్లి బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో NPCI ద్వారా లింక్ చేయాలి. ఈ మూడు ముఖ్యమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాతే ప్రభుత్వం నిధులను అకౌంట్‌లో జమ చేస్తుంది.
ఇది కూడా చదవండి: యాంకర్ కొమ్మినేనికి బిగ్ షాక్.. 14 రోజులు రిమాండ్! పరారీలో ప్రధాన నిందితుడు!
ఈ పథకానికి అర్హత పొందాలంటే, లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసులు కావాలి, ప్రభుత్వం గుర్తించిన పాఠశాలలో చదువుతూ, కనీసం 75% హాజరు ఉండాలి. తల్లి పేరిట బ్యాంక్ అకౌంట్ ఉండాలి, కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిలో ఉండాలి. అవసరమైన డాక్యుమెంట్స్‌లో విద్యార్థుల స్టడీ సర్టిఫికేట్, తల్లి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, నివాస పత్రం లేదా రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం (అవసరమైతే), పిల్లల హాజరు సర్టిఫికేట్ ఉండాలి. ఈ ప్రక్రియల్లో ఏదైనా పూర్తి చేయకపోతే, స్థానిక అధికారులను సంప్రదించి వెంటనే పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. NPCI లింకింగ్ స్టేటస్‌ను బ్యాంక్, గ్రామ/వార్డు సచివాలయం, మీసేవ కేంద్రం లేదా NPCI అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆ భారీ ప్రాజెక్టు పై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం! మహారాష్ట్ర ప్లాంట్‌ను పరిశీలించిన మంత్రి!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్! రూ.50 లక్షల విరాళం...
ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
బడ్జెట్ ట్రావెల్ కు బెస్ట్ డెస్టినేషన్లు! టాప్ 10 దేశాలు ఇవే! రోజుకి కేవలం..
ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!
ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!
ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..
చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!
మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!
రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!
ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!
అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?
ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!
తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: