
మృణాల్ ఠాకూర్ తెలుగు చిత్ర పరిశ్రమలో తన నటనతో మరియు అందంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల పరిచయం అయ్యారు . సీతామహాలక్ష్మీ పాత్రలో తన సహజమైన అభినయంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు.
ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నాన్న చిత్రంలో నటించిన మృణాల్ తెలుగులో సూపర్ హిట్ అందుకోలేకపోయారు. అయితే ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను మురిపించారు.రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ చిత్రంలో కూడా తాను నటనలో సత్తా చాటింది. ఈ సినిమాల్లోని సహజమైన నటన మరియు ప్రత్యేక హావభావాలు ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి.
మృణాల్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కొత్త సినిమాల విశేషాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అప్డేట్స్ ను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఫ్యాన్స్‌కి అందిస్తూ పాపులారిటీని కొనసాగిస్తోంది.
తాజాగా మృణాల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైట్ కలర్ డిజైన్ స్కర్ట్ లో కనిపిస్తూ, తన అందం, స్టైల్ ను ప్రదర్శించింది. కొంతమంది ఫ్యాన్స్ ఆమె గ్లామర్ లుక్ చూసి షాక్ అవుతున్నారు. మరికొందరు సీతారామం లో సింపుల్ చీరకట్టులో కనిపించిన మృణాల్, ఇప్పుడు గ్లామర్ లోనూ ఫోటోలు చూసేసరికి సీత నువ్వేనా అంటూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అడవి శేష్ మరియు మృణాల్ ఠాకూర్ నటిస్తున్న డెకాయిట్ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఇది రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతో నైనా తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలను అందుపించుకుంటారో లేదో అనేది చూడాల్సి ఉంది.