భారత క్రికెట్ వన్డే జట్టుకి కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ తన ఫిట్నెస్‌పై మళ్లీ దృష్టి పెట్టారు. కొంతకాలంగా ఆయన జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తూ, కఠినమైన ఫిట్‌నెస్ షెడ్యూల్ ఫాలో అవుతున్నారు. దాని ఫలితంగా తాజాగా 10 కిలోల బరువు తగ్గారని భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వెల్లడించారు. ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫొటోలో రోహిత్ మరింత ఫిట్‌గా, యంగ్‌గా కనిపించడంతో అభిమానులు సంబరపడుతున్నారు.
కొన్నాళ్లుగా రోహిత్ ఫిట్నెస్‌పై పలువురు విమర్శలు చేశారు. “ఇంత బరువుతో ఈ వయసులో క్రికెట్ ఆడటం కష్టం” అని అనేక కామెంట్లు వచ్చాయి. అయితే ఆ విమర్శలను సైలెంట్‌గా విని, కఠినమైన కసరత్తులతో తన శరీరాన్ని మలిచుకున్న హిట్‌మ్యాన్ ఇప్పుడు అందరికీ సమాధానం చెబుతున్నట్టుగా ఉంది. అభిమానులు సోషల్ మీడియాలో “ఎవరూ లెక్కచేయలేదు, కానీ హిట్‌మ్యాన్ రెస్పాన్స్ ఇవ్వకుండానే రెసల్ట్‌తో చూపించాడు” అని పొగడ్తలు కురిపిస్తున్నారు.
రోహిత్ శర్మ ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ, ఆయన టార్గెట్ 2027 వరల్డ్ కప్ అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. “ఒక్కసారి ఫిట్నెస్‌లో సీరియస్‌గా దిగితే రోహిత్‌ను ఆపలేరు” అని చాలామంది భావిస్తున్నారు. 2023 వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత్ ఓటమి తర్వాత రోహిత్ భావోద్వేగానికి లోనయ్యారు. అయితే ఆయన తన కెప్టెన్సీని కొనసాగిస్తూ, మళ్లీ గెలుపు దిశగా దూసుకుపోవాలని సంకల్పించుకున్నట్టుగా కనిపిస్తున్నారు.
రోహిత్‌కు దగ్గర స్నేహితుడైన అభిషేక్ నాయర్, ముంబయి ఇండియన్స్ తరపున కూడా ఆయనతో కలిసి పనిచేశారు. ఆయన మాట్లాడుతూ, “రోహిత్ ఎంత సీరియస్‌గా ట్రైనింగ్ చేస్తున్నాడో దగ్గరగా చూశాను. 10 కిలోలు తగ్గడం చిన్న విషయం కాదు. అతని కట్టుదిట్టమైన కృషి చూస్తే, ఇంకా చాలా ఇన్నింగ్స్ మిగిలి ఉన్నాయని అర్థమవుతోంది” అన్నారు.
రోహిత్ కొత్త ఫోటో చూసిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. కొందరు “హిట్‌మ్యాన్ మళ్లీ రిటర్న్ అయ్యాడు” అని రాస్తే, మరికొందరు “టార్గెట్ WC.. రోహిత్ శర్మ వర్కింగ్ స్ట్రిక్ట్‌గా” అని పోస్టులు చేస్తున్నారు. కొంతమంది అభిమానులు ఆయన కొత్త ఫిజిక్‌ను చూసి “ఇక పవర్ హిట్టింగ్ మరింత పెరుగుతుంది” అని కామెంట్స్ చేస్తున్నారు.
ఫిట్నెస్ అనేది ఆధునిక క్రికెట్‌లో అత్యంత కీలకం. వయసు పెరుగుతున్న సమయంలో రోహిత్ శర్మ చూపుతున్న ఈ క్రమశిక్షణ కొత్త తరం క్రికెటర్లకు కూడా ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది. 10 కిలోల బరువు తగ్గి మళ్లీ ఫిట్‌గా మైదానంలోకి వస్తున్న హిట్‌మ్యాన్.. 2027 వరల్డ్ కప్ కోసం సీరియస్‌గా ప్లాన్ చేస్తున్నాడని ఇప్పుడు అందరూ చెబుతున్నారు.