100Percent Tariff: భారత్ పై ట్రంప్ మరో పిడుగు.. వాటిపై 100% టారిఫ్! అక్టోబర్ 1 నుంచి అమలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 సీజన్‌లో పత్తి కొనుగోలుకు కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం గుర్తించిన మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా కొనుగోలు చేపట్టనున్నారు. ఈ ఏడాది 4.02 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగి, సుమారు 7.12 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. నవంబర్ నుంచి కనీస మద్దతు ధరకు సీఎం యాప్ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభం కానుంది. పొడవు పింజ పత్తి క్వింటా రూ.8,110, మధ్యస్త పింజ పత్తి క్వింటా రూ.7,710కి రైతుల నుండి కొనుగోలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

LPG Cylinder: ఇంటింటికి సాయం! LPG ధరలో భారీ తగ్గింపు! ఒక్కొక్క సిలిండర్ పై ఎంతో తెలుసా!

కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతులను గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా గుర్తిస్తారు. ఆధార్ ఆధారిత ఈ-పంట డేటా ఆధారంగా ఎంపిక చేయబడిన రైతులను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేస్తారు. ఈ విధానం వల్ల అర్హులైన రైతులు కనీస మద్దతు ధర పొందగలుగుతారు. అదనంగా రైతులకు సౌలభ్యం కల్పించేందుకు కాపాస్ కిసాన్ యాప్‌ను వినియోగించనున్నారు. ఈ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ సదుపాయం అందించబడుతుంది, దీని ద్వారా రైతులు తమ పంటను సమయానికి విక్రయించడానికి అవకాశం ఉంటుంది. మండలాల వారీగా పంట దిగుబడి వివరాలను యాప్‌లో నమోదు చేయడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతులు రేషన్‌కార్డు డేటా, ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం ఆధారాలు సమర్పించాలి. సీసీఐ చెల్లింపులు నేరుగా రైతుల ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.

KAPAS Kisan App: ఆ రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ! క్వింటా ధర రూ.8,110గా ఫిక్స్! సులభంగా స్లాట్ బుకింగ్ సదుపాయం!

రైతులు పత్తిని విక్రయ కేంద్రాలకు తీసుకురావడంలో గన్నీ, ప్లాస్టిక్ సంచులు వాడకుండా లూజు పత్తి రూపంలో తీసుకురావాలని సూచించారు. పత్తి నిల్వల కోసం మార్కెట్ యార్డులు, మిల్లుల్లో బీమా ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. మార్కెటింగ్ శాఖ పత్తి నాణ్యత ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించనుంది. యార్డుల్లో అగ్ని నిరోధక పరికరాలు, తేమ కొలిచే యంత్రాలు, ఎలక్ట్రానిక్ తూనికలు ఏర్పాటు చేయబడతాయి. అదనంగా పత్తి నిల్వ కోసం టార్పాలిన్లు, పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిన్నింగ్ మిల్లుల్లో కూడా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయనున్నారు.

Job Opportunities: ఈ కోర్సుల్లో చేరితే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు! టెన్త్ చదివిన వారికి కూడా... పూర్తి వివరాలివే!

పత్తి రవాణా వివరాలను సీఎం యాప్‌లో నమోదు చేయడం తప్పనిసరి. రవాణాదారులకు చెల్లింపులు పారదర్శకంగా జరగాలని సూచించారు. రైతులు తమ పత్తి విక్రయం కోసం అన్ని పత్రాలు సమర్పించిన తర్వాత మాత్రమే అనుమతి ఇవ్వబడుతుంది. జిల్లావారీగా పత్తి కొనుగోలు పనులను పర్యవేక్షించేందుకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు సకాలంలో మద్దతు ధర లభించేందుకు, పత్తి మార్కెట్‌లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ ఏడాది పత్తి దిగుబడి బాగుంటుందని ప్రభుత్వం ఆశిస్తూ, రైతుల కోసం అన్ని రకాల సదుపాయాలను కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

New Medtech Zone: ఏపీలో కొత్తగా మరో మెడ్‌టెక్ జోన్.. ఎయిర్‌పోర్ట్ పక్కనే ఆ జిల్లాలో ఫిక్స్, 140 ఎకరాల భూసేకరణ!
Bhagavad Gita: ధర్మాన్ని హరిస్తే అది మనల్ని హరిస్తుంది.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా-14!
APSDMA: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. రేపటికి వాయుగుండంగా - ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్!
25/09 టీడీపీ ప్రజావేదిక పరిష్కారాలు.. వైసీపీ సర్పంచ్ భూ దందా.. రాజకీయ కక్షతో 30 ఏళ్ల సాగు భూమి ఆక్రమణ!
GST: మహీంద్రా SUVs పై పండుగ సీజన్ బంపర్ డిస్కౌంట్లు! రూ.2.56 లక్షల వరకు ఆఫర్లు..!
Power star og : థియేటర్లలో ఉత్సాహం.. Xలో కొందరు మాత్రం DisasterOG అంటూ ట్రెండ్!