భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెస్టిండీస్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం జట్టును ఈ రోజు ప్రకటించింది. ఈ జట్టులో 15 మంది ఆటగాళ్లు ఉన్నారు. చాలా మార్పులు చోటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు వైస్ కేప్టెన్ బాధ్యతలు అప్పగించారు.
అక్టోబర్ 2వ తేదీ నుంచి భారత్‌లోనే వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌కి ప్రాధాన్యం ఉంది ఎందుకంటే ఇది ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2025-27 సైకిల్) లో భారత్ ఆడబోయే మొదటి స్వదేశీ సిరీస్. ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ 2-2తో సిరీస్‌ను చేసిన విషయం తెలిసిందే. ఆ సిరీస్ తర్వాత జట్టులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి.
ఈ సారి టెస్ట్ జట్టుకు శుభ్‌మన్ గిల్‌ను కేప్టెన్‌గా కొనసాగించారు. గతంలో టెస్ట్ వైస్ కేప్టెన్‌గా ఉండాల్సిన రిషబ్ పంత్ గాయం కారణంగా ఇప్పటికీ మైదానానికి దూరంగా ఉన్నాడు. అందుకే అతనికి బదులుగా జడేజాను సెలెక్టర్లు ఎంపిక చేశారు.
వికెట్ కీపింగ్ విభాగంలో కొత్తగా మార్పులు చేశారు. పంత్ అందుబాటులో లేకపోవడంతో ధ్రువ్ జురెల్ ప్రధాన వికెట్ కీపర్‌గా ఉంటారు. అలాగే ఎన్. జగదీశన్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా తీసుకున్నారు.
భారత టెస్ట్ జట్టు వెస్టిండీస్ సిరీస్ కోసం
శుభ్‌మన్ గిల్ (కేప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్ (వికెట్ కీపర్).మొత్తం మీద ఈ సారి సెలెక్టర్లు ఫామ్ లో ఉన్న వారినే ఎంపిక చేశారు. దీని వల్ల సిరీస్ మరింత ఆసక్తికరంగా మారుతుంది అని చెప్పుకోవాలి.