తగ్గేదేలే.. రికార్డులు బద్దలు..! నగరంలో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య!

నిజామాబాద్ పట్టణం మహబూబ్ బాగ్‌కు చెందిన సయ్యద్ బాబా (38) అనే గల్ఫ్ కార్మికుడు ముంబయి నుంచి సౌదీ అరేబియాలోని అభా నగరానికి వెళుతూ మార్గమధ్యంలో దుబాయి ఎయిర్ పోర్ట్‌లో విరామ సమయంలో ఆపస్మారక స్థితిలోకి జారుకున్న సంఘటన చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది అతన్ని రషీద్ హాస్పిటల్‌లో చేర్పించి మానవత్వం ప్రదర్శించారు. అస్వస్థతకు మత్తు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Rajamoulis birthday: దర్శకధీరుడు రాజమౌళి బర్త్‌డే స్పెషల్.. 12 సినిమాలు, 12 బ్లాక్‌బస్టర్లు!

ప్రస్తుతం దుబాయిలోని రషీద్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సయ్యద్ బాబాకు మెరుగైన వైద్యం అందించి, ఇండియాకు తిరిగి రప్పించాలని అతని భార్య సమీనా బేగం, సోదరుడు చోటు శుక్రవారం హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని  ఉద్దేశించి వినతిపత్రం సమర్పించారు. 

Andhra tech : సిలికాన్ తీర నగరం వైజాగ్.. టెక్ పెట్టుబడులతో ఆంధ్రకు నూతన యుగం!

ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సురేంద్రనాథ్ వారికి మార్గదర్శనం చేశారు. దుబాయిలో ఉన్న నిజామాబాద్ జిల్లాకు చెందిన నయీమ్, కొట్టాల సత్యం నారాగౌడ్‌లు రోగి బాగోగులు చూసుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

OTT Movies: థియేటర్లలో బ్యాన్! ఓటీడీలో దుమ్ము రేపుతున్న బోల్డ్ మూవీ!

నాలుగు రోజులు ఏమయ్యాడో... తెలియని పరిస్థితి!
సౌదీకి వెళ్లే క్రమంలో ఈనెల 3న ముంబయి నుండి 'ప్లయ్ దుబాయి' విమానంలో బయలుదేరిన సయ్యద్ బాబా ముందుగా దుబాయికి చేరుకున్నాడు. అక్కడ తొమ్మిది గంటల విరామాన్ని ఎయిర్‌పోర్ట్‌లో గడిపాడు.
అయితే సాయంత్రం 4 గంటలకు దుబాయి నుండి సౌదీ అరేబియాలోని అభా నగరానికి వెళ్లాల్సిన విమానాన్ని ఎక్కలేకపోయాడు. 

కొత్త Vivo V60 5G లాంచ్! లుక్, కెమెరా, బ్యాటరీలో మాస్టర్!

అనంతరం అతని మొబైల్ స్విచ్‌ఆఫ్ అయి నాలుగు రోజులపాటు ఏమయ్యాడో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సహాయం కోసం ఈనెల 7న సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు. 

Trumps: ఉక్రెయిన్ యుద్ధం ఆపే ట్రంప్ కృషి ప్రశంసనీయం.. రష్యా ప్రతినిధి వ్యాఖ్యలు!

దుబాయి ఎయిర్ పోర్ట్‌లో తప్పిపోయిన సయ్యద్ బాబా ఆచూకీ కనుగొనాలని తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి గారిని వారు కోరారు. వెంటనే స్పందించిన ప్రవాసీ ప్రజావాణి బృందం 'ప్లయ్ దుబాయి' విమాన సంస్థను సంప్రదించగా, అతను దుబాయి రషీద్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్టు నిర్ధారించారు.

Nobel Peace Prize : కాసేపట్లో నోబెల్ పీస్ ప్రైజ్.. 338 నామినేషన్లలో ఎవరికీ దక్కనుంది మహాగౌరవం!
రాజమౌళి–మహేష్ బాబు వైరల్ ఫోటో.. ఆ స్టార్ హీరో విష్ చేయలేదు!!
New National Highway: ఏపీలో కొత్త జాతీయ రహదారి రూ.691 కోట్లతో.. ఈ రూట్‌లో తిరుపతి, బెంగళూరుకు 70 కిమీ తగ్గనున్న దూరం!
Chandrababu Naidu: పారిశ్రామిక, ఐటీ రంగంలో ఏపీ అగ్రస్థానం..! రూ.1.14 లక్షల కోట్లు పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం..!
CP Sajjanar: ట్రాన్స్ జెండర్ల వేధింపులపై ట్వీట్.. వెంటనే స్పందించిన సీపీ సజ్జనార్!
Twin Banana: జంట అరటి పండ్లు తింటే కవలలు పుడతారా.. ఇది నిజమేనా?
Sourav Ganguly: రోహిత్ కెప్టెన్సీపై దాదా స్పందన.. ఇది తప్పు నిర్ణయం కాదు!
ఎయిరిండియా విమానానికి త్రుటిలో తప్పిన ముప్పు.. పదేపదే సాంకేతిక లోపాలు!
GHMC Alert: ఓటర్ ఐడీ లేకున్నా ఓటు హక్కు గ్యారంటీ..! జీహెచ్ఎంసీ కీలక స్పష్టత..!