Andhra tech : సిలికాన్ తీర నగరం వైజాగ్.. టెక్ పెట్టుబడులతో ఆంధ్రకు నూతన యుగం!

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానుల మధ్య భారీ చర్చ నడుస్తోంది. ఆయన దర్శకత్వం వహించిన ప్రతి చిత్రం ఒక మైలురాయిగా నిలిచింది. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక సక్సెస్ రేట్ సాధించిన దర్శకుడు ఆయననే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఆయన మొత్తం 12 సినిమాలు తీశారు కానీ ఒక్కదానికీ ఫ్లాప్ అనే ముద్ర తగలలేదు. ప్రతి చిత్రం ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది.

OTT Movies: థియేటర్లలో బ్యాన్! ఓటీడీలో దుమ్ము రేపుతున్న బోల్డ్ మూవీ!

రాజమౌళి కెరీర్ మొదలు ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమాతో. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఈ చిత్రం ఆయనకు మంచి ఆరంభం ఇచ్చింది. ఆ తర్వాత ‘సింహాద్రి’ సినిమాతో ఎన్టీఆర్ కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తరువాత వచ్చిన ‘సై’, ‘ఛత్రపతి’ సినిమాలు ప్ర‌భాస్‌ను యాక్షన్ హీరోగా నిలబెట్టాయి. ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’ లాంటి సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్, మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి.

కొత్త Vivo V60 5G లాంచ్! లుక్, కెమెరా, బ్యాటరీలో మాస్టర్!

అయితే ఆయన అసలు మాంత్రికం మొదలైంది ‘మగధీర’ సినిమా తర్వాతే. రామ్ చరణ్ హీరోగా చేసిన ఈ చిత్రం తెలుగు సినిమాకు కొత్త స్థాయి చూపించింది. సాంకేతికంగా, విజువల్‌గా, స్క్రీన్ ప్లే పరంగా రాజమౌళి కొత్త బాటలు వేయగలడని అందరూ అంగీకరించారు. ఆ తరువాత వచ్చిన ‘మర్యాద రామన్న’ లో హాస్యం, ఎమోషన్ మేళవించి చూపించారు. చిన్న కథను కూడా ఎంత గ్రిప్పింగ్‌గా చెప్పగలడో నిరూపించారు.

Trumps: ఉక్రెయిన్ యుద్ధం ఆపే ట్రంప్ కృషి ప్రశంసనీయం.. రష్యా ప్రతినిధి వ్యాఖ్యలు!

కానీ ఆయన సృజనాత్మకతకు గరిష్ఠ స్థాయి ‘ఈగ’ సినిమాలో కనిపించింది. చిన్న ఈగ పాత్రను హీరోగా చూపించి, ప్రేక్షకుల కళ్లలో నీళ్లు తెప్పించడం సాధారణం కాదు. ఆ తర్వాత ఆయన ప్రపంచ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లిన రెండు చిత్రాలు తీసారు ‘బాహుబలి: ది బిగినింగ్’ మరియు ‘బాహుబలి 2: ది కంక్లూజన్’. ఈ రెండు సినిమాలు కేవలం విజయవంతమైన చిత్రాలు మాత్రమే కాదు, భారత సినిమా చరిత్రలో గర్వించదగ్గ మైలురాళ్లు. బాహుబలి సినిమాలతో ప్రపంచానికి తెలుగు సినిమాకు ఉన్న శక్తిని చూపించారు.

Nobel Peace Prize : కాసేపట్లో నోబెల్ పీస్ ప్రైజ్.. 338 నామినేషన్లలో ఎవరికీ దక్కనుంది మహాగౌరవం!

ఇక ఇటీవల వచ్చిన ‘RRR’ ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల నటన, రాజమౌళి విజన్ కలిసినప్పుడు సినిమా ఎంత అద్భుతంగా మారుతుందో ఈ చిత్రం నిరూపించింది. ఆస్కార్ అవార్డు దాకా తీసుకెళ్లి, భారతీయ సినీ చరిత్రలో చిరస్మరణీయ ఘనత సాధించారు. ప్రస్తుతం ఆయన మహేశ్ బాబుతో కలిసి మరో భారీ బడ్జెట్ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం రూపొందిస్తున్నారు. అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

రాజమౌళి–మహేష్ బాబు వైరల్ ఫోటో.. ఆ స్టార్ హీరో విష్ చేయలేదు!!

మొత్తం మీద రాజమౌళి తీసిన ప్రతి సినిమా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే మణిగా మారింది. ఆయన సినిమాలు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కాదు  సినిమా అంటే ఏమిటి, విజన్ అంటే ఏమిటి, కష్టపడి కలలు ఎలా నిజం చేయాలి అనే పాఠాలు నేర్పిస్తాయి. అందుకే అభిమానులు సోషల్ మీడియాలో ఒకే మాట చెబుతున్నారు జక్కన్న సినిమాల్లో ఫేవరెట్ ఏదో చెప్పడం కష్టం... ఎందుకంటే ప్రతి సినిమా ఒక మాస్టర్‌పీస్‌! భారత సినిమా గర్వకారణం, తెలుగు ప్రజల గౌరవం ఎస్‌.ఎస్‌. రాజమౌళి గారికి జన్మదిన శుభాకాంక్షలు!

New National Highway: ఏపీలో కొత్త జాతీయ రహదారి రూ.691 కోట్లతో.. ఈ రూట్‌లో తిరుపతి, బెంగళూరుకు 70 కిమీ తగ్గనున్న దూరం!
Chandrababu Naidu: పారిశ్రామిక, ఐటీ రంగంలో ఏపీ అగ్రస్థానం..! రూ.1.14 లక్షల కోట్లు పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం..!
BSF Warning: పాకిస్తాన్‌కు BSF IG స్ట్రాంగ్ వార్నింగ్! భారత్ సరిహద్దు భద్రత సన్నద్ధం..!
Railway Update: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! రైల్వే కొత్త సదుపాయం... టికెట్ రద్దు అవసరం లేదు..!
భార్య ఎందుకు ఉపవాసం చేస్తుంది...కర్వా చౌత్ రహస్యమేంటి ?
Gold Loan: జాగ్రత్త.. గోల్డ్ లోన్ రూల్స్ మార్పు.! సామాన్యులకు షాక్ - ప్రతినెలా వడ్డీ చెల్లించాల్సిందే!
CP Sajjanar: ట్రాన్స్ జెండర్ల వేధింపులపై ట్వీట్.. వెంటనే స్పందించిన సీపీ సజ్జనార్!