Gold prices: బంగారం ధరలు పతనం.. వినియోగదారులకు గోల్డెన్ ఛాన్స్!

హైదరాబాద్‌లో ట్రాన్స్ జెండర్ల పేరుతో జరుగుతున్న వేధింపులపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్లు బహిరంగంగా డబ్బులు డిమాండ్ చేస్తూ ప్రజలను ఇబ్బందిపెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ నెటిజన్ ఈ విషయం మీద X (పూర్వ ట్విట్టర్)లో పోలీసులను నేరుగా ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం, కొన్ని ట్రాన్స్ జెండర్ గుంపులు ప్రజల దగ్గర నుంచి రూ.వేలు నుంచి రూ.ఐదువేల వరకు డబ్బులు అడుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.

రిషికొండ ప్యాలెస్ వినియోగంపై మంత్రివర్గం కీలక చర్చలు... త్వరలో ప్రకటనలు ఇవ్వనున్న ప్రభుత్వం!!

“హైదరాబాద్‌లో పోలీసు, రాజకీయ మద్దతుతో ట్రాన్స్ జెండర్ల దందా తారస్థాయికి చేరింది. రోడ్డు మీద గానీ, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గానీ, షాపింగ్ ఏరియాల్లో గానీ వీరి వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలి” అంటూ ఆ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ అవడంతో విషయం సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ (సజ్జనార్) దృష్టికి వెళ్లింది.

ఎట్టకేలకు శుభవార్త.. బ్లాక్‌బస్టర్ 'మిరాయ్' ఓటీటీలోకి ఎంట్రీ.! తెలుగుతో పాటు పలు భాషల్లో..

ఈ ట్వీట్‌పై వెంటనే స్పందించిన సీపీ సజ్జనార్ “మీరు ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. దీనిని తీవ్రంగా పరిగణిస్తాం. వాస్తవాలను ధ్రువీకరించి, చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటాం” అని రీట్వీట్ చేశారు. ఆయన ఈ ట్వీట్ చేయగానే హైదరాబాదులోని పలు నెటిజన్లు తమ అనుభవాలను కామెంట్ సెక్షన్‌లో షేర్ చేశారు. చాలా మంది రోజూ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాన్స్ జెండర్లు వాహనాల వద్దకు వచ్చి డబ్బులు అడుగుతున్నారని, కొందరు ఇవ్వకపోతే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.

మోదీ సర్కార్ తీపికబురు.. 21వ విడత పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఈ 4 రాష్ట్రాల రైతులకు తక్షణ సాయం!

కొంతమంది మాత్రం దీనిపై వేరే కోణం నుంచి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ట్రాన్స్ జెండర్లు సమాజంలో అణగారిన వర్గమని, వారికి సరైన ఉపాధి అవకాశాలు లేవని, అందువల్ల ఇలాంటి పనులకు దిగుతున్నారని కొందరు వాదించారు. అయితే, అదే సమయంలో బెదిరింపులు చేయడం, బలవంతంగా డబ్బులు తీసుకోవడం చట్టవిరుద్ధమని స్పష్టంగా పేర్కొన్నారు.

Nobel Prize : నా వల్లే యుద్ధాలు ఆగాయి.. ట్రంప్ కు ఈ ఏడాది నోబెల్ రానట్టే.. కారణమిదే!

పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం, సీపీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఇప్పటికే కొన్ని బృందాలు రంగంలోకి దిగాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రధాన మార్కెట్లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ జంక్షన్లు వంటి ప్రాంతాల్లో పోలీసులు గమనిస్తున్నారని తెలిసింది. వాస్తవంగా ఇలాంటి దందాలు జరుగుతున్నాయా? జరిగితే వీటికి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే దిశలో విచారణ సాగుతున్నట్లు చెబుతున్నారు.

Fire Accident: ఏపీలో ఘోర అగ్నిప్రమాదం! రూ.500 కోట్ల ఆస్తి నష్టం!

ఇదే సమయంలో సజ్జనార్ మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎవరైనా ట్రాన్స్ జెండర్లు లేదా ఇతర వ్యక్తులు వేధింపులకు పాల్పడితే వెంటనే 100 నంబర్‌కి కాల్ చేయండి లేదా సిటీ పోలీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఫిర్యాదు చేయండి. ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.

అల్లు అర్జున్ మార్కెట్ ఆ స్థాయిలో లేకపోవడంతో..ప్రమాదమని భావించినా అల్లు అరవింద్!!

ఇటీవల హైదరాబాద్‌లో పలు చోట్ల భిక్షాటన పేరుతో, శుభకార్యాల్లో డబ్బు అడగడం పేరుతో కొన్ని ట్రాన్స్ జెండర్ గుంపులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరు వ్యాపారులు, కార్ డ్రైవర్లు, మహిళలు కూడా వీరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. అయితే, మరోవైపు ప్రభుత్వానికి చెందిన మహిళా & శిశు సంక్షేమ శాఖ కూడా ఈ అంశంపై దృష్టి పెట్టి, ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలను పరిశీలిస్తోంది. మొత్తం మీద, సజ్జనార్ స్పందనతో ఈ ఇష్యూ మళ్లీ చర్చనీయాంశమైంది. ప్రజలు సోషల్ మీడియాలో పోలీసుల చురుకైన స్పందనను ప్రశంసిస్తున్నారు. ట్రాన్స్ జెండర్ల హక్కులు కాపాడుతూనే, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

NTR Bhrosa: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తనిఖీ ప్రారంభం! లబ్ధిదారులకు కీలక సమాచారం!
బరువు తగ్గాలంటే రోజూ ఉదయం ఇదే బెస్ట్.. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండే మ్యాజిక్ ఫుడ్!
అతిపెద్ద పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ నోటిఫికేషన్..ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!!
తెలుగు రాష్ట్రాలపై వచ్చే వారమంతా కుండపోత సూచన...బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!!
H1B Visa Alert: ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనలతో భారతీయ టెకీలకు షాక్..! హెచ్-1బీ వీసా కఠినతర మార్పులు..!
Diseses without symptoms: ఈ వ్యాధులు చాలా డేంజర్.. లక్షణాలు లేకుండా ప్రాణాలు తీస్తాయి.!
TTD: తిరుమల వృద్ధుల దర్శనంపై టీటీడీ స్పష్టత..! ఆ పుకార్లను నమ్మకండి..!