Lahore city Pakistan: ఇజ్రాయెల్ దాడులపై నిరసన.. పాక్‌లో లాహోర్ నగరంలో తీవ్ర ఉద్రిక్తత!

దేశంలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్‌ బ్యాంక్ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) మరోసారి ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. వీటిలో మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ స్థాయి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టుల కోసం 2025 అక్టోబర్‌ 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చని బ్యాంక్‌ స్పష్టం చేసింది.

Supreme court: వాట్సాప్ ఖాతా బ్లాక్ చేశారని కోర్టుకెళితే..! దేశీయ యాప్ ‘అరట్టై’తో..!

మొత్తం 10 పోస్టుల్లో మేనేజర్‌ పోస్టులు 6, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు 3, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టు 1 ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ, ఎంబీఏ లేదా పీజీడీబీఎంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదనంగా, సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎస్‌బీఐ ప్రకారం, ప్రతి పోస్టుకు వయోపరిమితి వేరుగా నిర్ణయించబడింది. మేనేజర్‌ పోస్టులకు 24–36 సంవత్సరాలు, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు గరిష్టంగా 30 సంవత్సరాలు, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టులకు 35–45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

CDSCO: ఇది ఒక కంపెనీ తప్పు కాదు.. మొత్తం వ్యవస్థ వైఫల్యం.. CDSCO వ్యాఖ్య!

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు రూ.750 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు మినహాయింపు ఉందని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఈ నియామకాలలో ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు ప్రకటించింది. ఎంపికైన వారికి బ్యాంక్‌ నియమావళి ప్రకారం పదవీ స్థాయికి అనుగుణంగా జీతభత్యాలు అందించనుంది.

AP Police Jobs: ఏపీ పోలీస్ శాఖలో రికార్డు స్థాయి ఉద్యోగాలు..! నిరుద్యోగులకు బంపర్ అవకాశం..!

ఉద్యోగంలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.64,820 నుంచి రూ.1,35,020 వరకు జీతం లభించనుంది. అదనంగా బ్యాంక్‌ అందించే ఇతర భత్యాలు, ప్రోత్సాహకాలు, ఆరోగ్య బీమా, పెన్షన్‌ సదుపాయాలు కూడా వర్తిస్తాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఎస్‌బీఐ తమ సంస్థలో అర్హత కలిగిన మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్స్‌కి అవకాశం కల్పిస్తోందని తెలుస్తోంది. అర్హులు గడువు తేదీకి ముందే దరఖాస్తు పూర్తి చేయాలని, అవసరమైన పత్రాలను సక్రమంగా అప్‌లోడ్‌ చేయాలని ఎస్‌బీఐ సూచించింది.

ఆసియా కప్ 2025 ట్రోఫీ వివాదం.. భారత్ విజయం పై నీడ వేసిన నఖ్వీ నిర్ణయం!
వారమంతా వేచి చూసే ఆ 3 రోజులు ఇవే! పల్లెకు పయనమయ్యేందుకు సిద్ధంకండి!!
Liquor incident: ధైర్యముంటే తప్పు చేశానని ఒప్పుకోండి.. వర్ల రామయ్య వ్యాఖ్య!
PM Modi: వారికి భారీ శుభవార్త! మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ..!
Gulf News: గల్ఫ్ సమస్యలపై అసెంబ్లీలో హరీష్ రావు తప్పక స్పందించాలి! ఈరవత్రి సంచలన వ్యాఖ్యలు!