బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తన సినిమాల ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో ఆయనకు క్రియేటివ్ దర్శకుడిగా పెద్ద పేరు వచ్చింది. ఆయన సినిమాలు కేవలం భారత ప్రేక్షకులకే కాక, విదేశీ ప్రేక్షకులకూ అభిమానాన్ని సంపాదించాయి.
నేడు రాజమౌళి పుట్టినరోజు ఈ సందర్భంగా సినిమా ప్రేమికులు, ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికలపై ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మహేష్ బాబు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోని ఎక్స్ ద్వారా పోస్ట్ చేయడం జరిగినది. పోస్ట్ చేసిన కొద్ది వ్యవధిలో ఆ పోస్టు వైరల్ గా మారింది.
రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా రాజమౌళికి పుట్టినరోజు విషెస్ చెప్పడం జరిగినది. జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి స్నేహం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్ కూడా హ్యాపీ బర్త్ డే జక్కన్న అని వాళ్ళిద్దరు ఉన్న ఫోటోను సోషల్ మీడియా వేదికలో పంచుకున్నారు. ప్రముఖ తారలు సైతం రాజమౌళికి విషెస్ చెప్పడం జరిగినది.

ఇప్పటికే, రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న #SSMB29 సినిమా రూపొందుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవ్వనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న చిత్రానికి వారణాసి అనే టైటిల్ పెట్టనున్నట్లు సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేసింది అయితే నవంబర్ 16న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను అధికారకంగా ప్రకటించనున్నారు సినిమా బృందం.