ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమ శాఖ ENC సబ్బవరపు శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ACB చేతిలో చిక్కాడు. ఇంకో మూడు వారాల్లో రిటైర్మెంట్ ఉండగా, చివరి అవకాశంగా భావించి పెద్ద మొత్తం సంపాదించాలనుకున్నాడేమోనని అనుమానిస్తున్నారు.
వివరాల ప్రకారం, ఒక సంస్థకు రూ.35 కోట్ల బిల్లుల మంజూరు కోసం ఆయన రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారులు ACBకి ఫిర్యాదు చేశారు.
దీనిపై విజయవాడలో ACB అధికారులు ట్రాప్ ఏర్పాటు చేసి, రూ.25 లక్షల టోకెన్ అమౌంట్ స్వీకరిస్తున్న సమయంలో అతన్ని పట్టుకున్నారు. ఇది మొత్తం లంచం డీల్‌లో మొదటి విడత మాత్రమే అని తెలుస్తోంది.
గతంలో కూడా ఈ అధికారి రెండుసార్లు లంచం కేసుల్లో పట్టుబడ్డాడు. అయినా, ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు.
ACB వర్గాల ప్రకారం, ఇది వారి చరిత్రలోనే అతిపెద్ద ట్రాప్‌లలో ఒకటిగా భావిస్తున్నారు. ఈ కేసు రాష్ట్రంలో మళ్లీ అవినీతి చర్చలను తెరమీదకు తెచ్చింది.