రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ది రాజాసాబ్ మారుతి దర్శకత్వంలో తరికెక్కిన ఈ చిత్రం పోస్టర్స్ టీజర్ తోనే సగం విజయం కైవసం చేసుకుందనే చెప్పుకోవచ్చు. ఈరోజు విడుదలైన ట్రైలర్ తో ప్రేక్షకుల భారీ అంచనాలు పెంచాడు మారుతి. అసలే ప్రభాస్ పాన్ ఇండియా ఇండియా స్టార్ట్ డార్లింగ్ సినిమాలు కోసం కోట్ల మంది అభిమానులు ఎదురుచూస్తారు వారిని నిరాశపరచకుండా విజువల్ ఎఫెక్ట్స్ తో సౌండ్స్ తో ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మారుతి చూపించడం గొప్ప విశేషంగానే చెప్పుకోవాలి.
మొదటిగా ట్రైలర్ మ్యూజిక్ తో స్టార్ట్ అవుతుంది ఆ మ్యూజిక్ తోనే తమన్ ప్రేక్షకులు కట్టిపడేసి అని చెప్పుకోవాలి తర్వాత ప్రభాస్ డైలాగ్ చంపేశాడు బాబయ్ అనే డైలాగ్ తో హైలెట్ అయింది అని చెప్పాలి. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో తాత రండి పరిచయం చేస్తా.. అంటే పరిచయం చేయడమేంట్రా అని.. మరి చూస్తారు ఏంట్రా పరిగెత్తండి అని భయంతో ప్రభాస్ అంటాడు ఆ సీన్ మాత్రం ఫన్నీగా అనిపిస్తుంది.
నిధి అగర్వాల్ ని చూసి ఏదో గుర్తుండే పని చేయాలి అంటూ సంచలనం అయిపోవాలి ఏంట్రా ఎంత పని చేసాడు అని అందరూ షాక్ అయిపోవాలి...స్టార్ టు స్టార్ వార్ అనే డైలాగ్ మాత్రం ఈ ట్రైలర్ కి హైపిస్తుందని చెప్పుకోవాలి. మొత్తానికి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విజువల్ ఎఫెక్ట్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రభాస్ ని డైరెక్టర్స్ అందరూ మాస్ లుక్ లో చూపించిన మారుతి మాత్రం హ్యాండ్సమ్ బాయ్, ఫ్లటింగ్ బాయ్ లాగా ప్రభాస్ ని చూపించడం విశేషంగా చెప్పుకోవచ్చు.
ఈ చిత్రం వచ్చే ఏడది సంక్రాంతికి విడుదల కానుంది అని చిత్ర బృందం తెలిపింది.ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు.
ఏంట్రా ఇంత పని చేశాడు ప్రభాస్... అందరూ షాక్ అవ్వాల్సిందే!
