Vijayawada Ustav: గిన్నిస్ రికార్డుతో ప్రపంచ పటంలో నిలిచిన విజయవాడ ఉత్సవ్ 2025!

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శలు చేసి, భారీ సుంకాలు విధించాలని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బలమైన స్పందన వ్యక్తం చేశారు.

Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్! ఈ రూట్లలో 26 ప్రత్యేక రైళ్లు!

భారత్ తన స్వంత అవసరాల కోసం చమురు కొనుగోలు చేస్తోంది కాబట్టి ఎవరూ దానిపై ఒత్తిడి చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. బయటి దేశాల హెచ్చరికలు లేదా బెదిరింపులు చూసి భారత్ తన నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరం లేదని పుతిన్ అన్నారు.

VMRDA Projects: ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.174 కోట్లతో వీఎంఆర్డీఏ ఏడు రహదారుల నిర్మాణం!

గురువారం దక్షిణ సోచిలో మీడియాతో మాట్లాడిన పుతిన్, ట్రంప్ తీసుకుంటున్న విధానాలను తీవ్రంగా విమర్శించారు. మాస్కోతో ఇంధన వ్యాపారం చేయొద్దని ఇతర దేశాలపై ఒత్తిడి తేవడం పూర్తిగా తప్పు చర్య అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల చివరికి అమెరికాకే దెబ్బ తగులుతుందని పుతిన్ హెచ్చరించారు.

Bhagavad Gita: ఓం పరమ పవిత్రాయై నమః.. జ్ఞానం కన్నా పవిత్రం మరొకటి లేదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -21!

రష్యా వాణిజ్య భాగస్వాములపై అమెరికా భారీ సుంకాలు విధిస్తే, అది కేవలం ఆ దేశాలకే కాదు, ప్రపంచం మొత్తం ఇంధన ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పుతిన్ చెప్పారు. చమురు ధరలు పెరగడం వల్ల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచక తప్పదని, దాంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.

Windows 10 Support End: విండోస్ 10 యూజర్లకు భారీ అలర్ట్.. మీ భద్రతకు ముప్పు! విండోస్ 11 వైపు మళ్లండి - చివరి తేదీ ఎప్పుడంటే:

పుతిన్  ఇంధన రంగం అనేది గ్లోబల్ మార్కెట్. ఒక దేశం మరో దేశంపై ఒత్తిడి తీసుకొచ్చినా, ఆ దుష్ప్రభావం ప్రపంచమంతటికీ వస్తుంది. అందుకే అమెరికా తన విధానాల్లో మార్పులు చేసుకోవాలని ఆయన సూచించారు.

చరిత్ర సృష్టించిన ఒప్పందం.. 5 ఏళ్ల తర్వాత భారత్, చైనా మధ్య మళ్లీ డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులు షురూ!

ఈ సందర్భంగా పుతిన్ తన రాబోయే భారత్ పర్యటన గురించి కూడా వెల్లడించారు. డిసెంబరులో భారత్ లో పర్యటించనున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  మోదీతో తనకు ఉన్న స్నేహబంధం ఎంతో బలంగా ఉందని, ఇద్దరు దేశాల మధ్య వాణిజ్య, ఇంధన, రక్షణ రంగాలలో అభివృద్ధి గురించి చర్చించనున్నారు అని తెలిపారు.

Cold drink pregnancy: ప్రెగ్నెన్సీలో కూల్డ్రింక్ తాగితే.. ఏమవుతుంది.. నిపుణుల సలహాలు!

రష్యా–భారత్ సంబంధాలు ఎప్పటినుంచో బలంగా ఉన్నాయని ఎప్పటికీ మిత్రదేశాలుగానే కొనసాగుతాయని పుతిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. బయటి దేశాల ఒత్తిడిని పట్టించుకోకుండా రెండు దేశాలు తమ ప్రయోజనాల కోసం కలిసి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

BSNL Services: బీఎస్‌ఎన్‌ఎల్ దూకుడు.. విప్లవాత్మక మార్పు! ఇకపై ఫిజికల్ సిమ్ కార్డులు ఉండవు..
ఉత్తరాంధ్రకు వాయు'గండం': సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష.. 3 జిల్లాల్లో ఆకస్మిక వరదల ముప్పు!
Maoist: బీజాపూర్‌లో 103 మంది మావోయిస్టుల లొంగుబాటు..!ఆయుధాలు వదిలి శాంతి మార్గం వైపు..!