పాకిస్థాన్ వరుసగా మూడో రోజూ డ్రోన్ దాడులు చేపట్టింది. జమ్మూ, శ్రీనగర్ పరిధిలోని ప్రాంతాల్లో భారీగా దాడులకు పాల్పడుతోంది. మరోవైపు వీటిని భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. దీంతో ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర భేటీ నిర్వహించారు. విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తన నివాసంలో ప్రధాని మోదీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ తో పాటు.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ అనిల్ చౌహాన్, విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్ సహా త్రివిధ దళాల అధిపతులు హజరయ్యారు. ఇక ఈ భేటీకి ముందు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భేటీ అయ్యారు. సరిహద్దుల్లో,విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. పలు సూచనలు చేశారు.
ఇది కూడా చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! కొత్త రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఇవే రూల్స్...!
మరోవైపు పాకిస్థాన్ మూడో రోజూ దాడులకు తెగబడింది. జమ్మూ, సాంబా, పఠాన్‌కోట్ లక్ష్యంగా డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది. అమృత్‌సర్, ఫిరోజ్‌పుర్, హోషియార్ పుర్, గురుదాస్ పుర్, తర్న్ తరణ్ ప్రాంతాలే లక్ష్యంగా డ్రోన్ దాడులు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
జమ్మూ నగరంలో తనకూ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రజలు వీధుల్లోకి రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని ఒమర్ అబ్దుల్లా సూచించారు. ఇక తాజాగా కాశ్మీర్ లోని అవంతిపురా వైమానిక స్థావరంపై పాకిస్థాన్ దాడులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పాక్ డ్రోన్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు.. తనిఖీలు చేస్తున్న సిబ్బంది!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడు, వీడు అంటూ అధికారిపై మండిపాటు!
3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ సూచన!
యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్!
ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..
జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!
తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!
అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..
పాక్‌కు యూకే షాక్.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...
ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: