హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేగింది. విమానాశ్రయంలో బాంబు అమర్చినట్లు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అధికారులకు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు సందేశం అందింది. ఈ సమాచారంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు, భద్రతా సిబ్బంది వెంటనే తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు ఈ-మెయిల్ అందిన వెంటనే, శంషాబాద్ విమానాశ్రయ అధికారులు పోలీసులకు, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్)కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై, హుటాహుటిన రంగంలోకి దిగారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాలను రప్పించి విమానాశ్రయ ప్రాంగణమంతా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల రాకపోకలు, లగేజీ స్కానింగ్ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాలు సహా కీలకమైన అన్ని ప్రాంతాల్లోనూ క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. అయితే, ఈ బెదిరింపు ఈ-మెయిల్ నిజమైనదా లేక కేవలం ఆకతాయిల చర్యా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? అనే వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడు, వీడు అంటూ అధికారిపై మండిపాటు!
3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ సూచన!
యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్!
ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..
జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!
తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!
అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..
పాక్‌కు యూకే షాక్.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...
ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: