Samantha Comments: అతని కోసమే ఒప్పుకున్నా..I Love You.. మొత్తానికి ఓపెన్ అయిన సమంత! ఆ సమయంలో తనను..

జడ్పీటీసీ ఉప ఎన్నికతో పులివెందుల అట్టుడికిపోతోంది. ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా నేతలు భారీగా మోహరించారు. పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ స్థానాన్ని గెలుచుకుని పరువు నిలుపుకోవాలని వైకాపా తాపత్రయ పడుతుండగా.. వైకాపా కంచుకోటను బద్దలు కొట్టాలని తెదేపా శ్రేణులు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.

World News: అక్కడ ఇల్లు కొంటే.. 150 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్! ఆఫర్‌పై ప్రపంచం ఉత్సాహం!

పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జిల్లాలో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో కొందరు శక్తివంతుల చేతుల్లో ఓటర్ల జాతకాలు ఉండేవి. స్వతంత్రంగా ఓటు వేయాలంటే సామాన్యుడికి అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. సుమారు 10,600 మంది ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే దశకు చేరుకున్నారన్నది విశేషం.

Indore Madhya Pradesh: పాల క్యాన్‌ను హెల్మెట్‌లా పెట్టుకున్న రైడర్‌… పెట్రోల్ బంక్ సీజ్!

ఈ నేపథ్యంలో తమ అభ్యర్థులను గెలిపించేందుకు ఇరుపార్టీలు కీలక నేతలతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీకి చెందిన బీటెక్ రవి, తన సతీమణి లతా రెడ్డిను అభ్యర్థిగా బరిలోకి దింపారు. మరోవైపు వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి పోటీలో ఉన్నారు.

Modi Reacts: అమెరికా టారిఫ్ దాడి.. భారత్‌ ఎవరికీ తలవంచదు.. ట్రంప్ కి కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ!

తెదేపా తరఫున జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణచైతన్య రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఎమ్మెల్సీ రాం గోపాల రెడ్డి, పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. నియోజకవర్గ స్థాయి నేతలంతా ఇప్పటికే పులివెందులలో మోహరించారు.

Secunderabad: అక్టోబర్ 19 వరకు సికింద్రాబాద్‌లో రైళ్లు ఆగవు! ఎందుకంటే?

వైసీపీ తరఫున ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిలు ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సమావేశాలు, డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

Tirupati violence: వైసీపీ నేత గ్యాంగ్ దౌర్జన్యం! తిరుపతిలో దళిత యువకుడి పై దాడి!

ఈ ఎన్నికలో ఎవరు గెలుస్తారు అనేది కొలమానంగా కాకుండా, ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయగలగడం కీలకాంశంగా మారింది. రాజకీయంగా ఈ ఎన్నిక మరిన్ని పరిణామాలకు నాంది కావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతకు సంబంధించి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Asim Munir: రెండు నెలల్లో రెండోసారి..! మళ్లీ అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్!

అధికార పార్టీకి గ్రామాల్లో లభిస్తున్న ఆదరణతో కొందరు వైకాపా నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. తెదేపా జెండా కప్పుకొంటున్నారు. గతంలో వైకాపా బాధితులందరూ ఏకమై తెదేపా గెలుపుకు కృషిచేస్తుండటం వారికి మింగుడు పడకుంది. పాడా పేరిట సాగిన అవినీతి అక్రమాలపై జనం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో దిక్కుతోచని వైకాపా అక్కడక్కడ కవ్వింపు చర్యలకు దిగుతోంది. కీలక నేతలు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి కొందరిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, హెచ్చరికలకు పాల్పడుతున్నారు. ఎన్నికల నిబంధనలనూ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. పులివెందులలో వైకాపా బుధవారం నిర్వహించిన ర్యాలీనే ఇందుకు నిదర్శనం.

Wayside Amenities: హైవేల పక్కన ఎమినిటీ సెంటర్లు.. ప్రయాణికుల కోసం కేంద్రం కొత్త ప్రణాళిక!
Modi visits China: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి చైనాకు... ప్రధాని మోదీ!
Second-hand car: సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటున్నారా! ఈ 5 తప్పక చెక్ చేసుకోండి!