ఇది కూడా చదవండి: NRI లు పంపే డబ్బు ఈ సం// రికార్డు బ్రేక్! ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశం గా ఇండియా! ఆ దేశం నుండే ఎక్కువ!

అమెరికా (America) లో మరోసారి తుపాకుల మోత మోగింది. ఫిలడెల్ఫియాలోని గ్రేస్ ఫెర్రీ ప్రాంతంలో సోమవారం (Monday) తెల్లవారుజామున జరిగిన భారీ కాల్పుల ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సౌత్ ఎటింగ్ స్ట్రీట్‌లో కొందరు వ్యక్తులు ఓ వీధిలో గుమిగూడారు. ఆ సమయంలో పలువురు దుండగులు ఒక్కసారిగా తుపాకులు బయటకు తీసి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ భయానక దృశ్యాలు అక్కడే ఉన్న ఓ సీసీ టీవీ కెమెరా (CCTV camera) లో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో జాసన్ రీస్ (19), జహీర్ వైలీ (23), అజిర్ హారిస్ (24) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిలో 15 ఏళ్ల బాలిక, ఇద్దరు 17 ఏళ్ల బాలురు కూడా ఉన్నారు.

ఇది కూడా చదవండి: Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం! హైదరాబాదు కుటుంబం సజీవదహనం

గాయపడిన వారిలో 19 ఏళ్ల యువకుడి పరిస్థితి విషమంగా ఉందని, మిగతా వారు కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు. కాల్పుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. ఘటనపై ఫిలడెల్ఫియా పోలీస్ కమిషనర్ కెవిన్ బెథెల్ తీవ్రంగా స్పందించారు. "ఇది పిరికిపందల చర్య. అక్కడున్న ఇళ్లు, కార్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తామేదో గూండాలమనుకునే వాళ్లు చేసే నీచమైన పని ఇది" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో పోలీసులు సమీపంలోనే ఉన్నారని, కాల్పుల శబ్దం విని వెంటనే అక్కడికి చేరుకున్నారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పలువురు అనుమానితుల ఫొటోలను విడుదల చేసిన పోలీసులు, నిందితుల సమాచారం తెలిస్తే తెలియజేయాలని ప్రజలను కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Dwakra: ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుతమైన అవకాశం..! ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు, వివరాలివే..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Delhi Tour: బుందేలఖండ్ తరహాలో సాయం చేయండి.. కేంద్రానికి మంత్రి విజ్ఞప్తి!

Krishna River Flood: కృష్ణానదికి పెరుగుతున్న వరదపోటు! శ్రీశైలానికి గంట గంటకూ.. భారీ జలప్రవాహం!

Lokesh Tour: నెల్లూరు రొట్టెల పండుగలో పాల్గొన్న లోకేశ్.. ఏ రొట్టె తీసుకున్నారంటే.?

KRIS City: ఏపీలో కొత్తగా క్రిస్ సిటీ.. రూ.37,500 కోట్లతో.. ఆ జిల్లా దశ తిరిగినట్లే! రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం!

APNRT: ప్రవాసుల ఆదాయం పెంచే లక్ష్యంగా ఏపీఎన్‌ఆర్‌టీఎస్ భారీ ప్రణాళికలు! యువతకు విదేశీ ఉద్యోగాలు! ప్రెసిడెంట్ రవి వేమూరు!

Jagan Shock : వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేతలకు నోటీసులు జారీ! పోలీస్ స్టేషన్‌కి..

Raghurama Speech: నాకు ఒక్క రోజు హోంమినిస్టర్ పదవి ఇస్తే రెడ్ బుక్ కాదు.. అంతా బ్లడ్ బుక్కే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group