రిలయన్స్ జియో దేశంలోని అగ్రగామి టెలికాం సంస్థగా మరోసారి వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. సెప్టెంబర్ 5న తన తొమ్మిదవ వార్షికోత్సవంను పురస్కరించుకొని జియో బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఇప్పటికే తమ యూజర్ల సంఖ్య 50 కోట్ల మార్కును అధిగమించిందని జియో గర్వంగా వెల్లడించింది. ఈ గొప్ప మైలురాయిని పురస్కరించుకుంటూ ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకోవాలని నిర్ణయించింది.
ప్రత్యేకంగా అపరిమిత డేటా ఉచితం ఆఫర్‌ను ప్రకటించడం వినియోగదారులకు నిజమైన పండగలాంటిదే. సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5 వరకు రూ.349 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లతో ఉన్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు అపరిమిత 5జీ డేటా ఉచితంగా అందించనుంది. అంతేకాదు, వార్షికోత్సవ వీకెండ్ ఆఫర్ కింద సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు 5జీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ప్రస్తుత ప్లాన్ సంబంధం లేకుండా అపరిమిత 5జీ డేటా లభించనుంది. అదే సమయంలో 4జీ వినియోగదారుల కోసం రూ.39 ప్రత్యేక రీచార్జ్‌తో రోజుకు గరిష్ఠంగా 3జీబీ డేటా పొందే అవకాశం కల్పించింది.
ఇక మరో కీలక బహుమతిగా, జియో హోం సేవలను రెండు నెలలపాటు పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు ఇంటి నుంచే హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అదనపు ఖర్చు లేకుండా ఆస్వాదించవచ్చు. ఈ ఆఫర్లు వినియోగదారులకు నిజమైన వరప్రసాదమని చెప్పవచ్చు. జియో తొమ్మిదో వార్షికోత్సవం వినియోగదారులందరికీ డేటా ఫెస్టివల్‌గా మారింది.