ఏపీలో విపక్ష వైసీపీని టార్గెట్ చేస్తూ వరుస అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త పాలేటి కృష్ణవేణితో ప్రారంభిస్తే గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి పాల్పడిన రాజ్ కసిరెడ్డి, ఇంటెలిజెన్స్ ఛీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు వరకూ వరుస అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై వైసీపీ తీవ్ర విమర్శలకు దిగుతోంది. వీటిపై ఇవాళ హోంమంత్రి వంగలపూడి అనిత ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వ హయాంలో అధికారుల అరెస్టులు జరగడం లేదని, వైసీపీ హయాంలో తప్పులు చేసిన వారిని మాత్రమే అరెస్టు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత క్లారిటీ ఇచ్చారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు అరెస్టు చేశారని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు 3 లక్షల మందికి..
తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని, అప్పట్లో మహిళలని కూడా చూడకుండా ఇబ్బందులు పెట్టారని హోంమంత్రి గుర్తుచేశారు. గతంలో టీడీపీ నేతల్ని వేధించడానికి సీఐడీని వాడిన వ్యక్తి జగన్ అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా తప్పు చేసిన వారిని మాత్రమే శిక్షిస్తున్నట్లు హోంమంత్రి అనిత చెప్పుకొచ్చారు. టీడీపీ కార్యకర్తల్లో, నేతల్లో ఇలాంటి వారిపై ఆవేశం ఉన్నా తాము మాత్రం వారిని చట్ట ప్రకారమే శిక్షిస్తున్నట్లు తెలిపారు. గతంలో జగన్ వల్ల శ్రీలక్ష్మి వంటి అధికారులు జైలుకెళ్లారని, ఇప్పుడు కూడా వైసీపీ హయాంలో పనిచేసిన అధికారులే ఎందుకు జైలుకెళ్తున్నారో జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. అలాగే అరెస్టులపై జగన్ నాలుగు గోడలు దాటి బయటికి వచ్చి మాట్లాడాలని హోంమంత్రి సవాల్ విసిరారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?
లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!
అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రి, రాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!
మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!
కసిరెడ్డి కేసులో కీలక మలుపు! రేపు సిట్ ముందు హాజరు! వారికి ఇక మూడిందే!
వైసీపీకి బిగ్ షాక్.. ఆన్‌లైన్ బెట్టింగ్ లో ముఠా గుట్టురట్టు కీలక నేతపై కేసు!
సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!
జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!
జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
మంత్రితో పాటు పార్టీ నేతలకు తప్పిన ప్రమాదం! పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే..
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: