ఇది జూన్ 3 ఇండియాలో రిలీజ్ కానుంది. టాటా హారియర్ EVని భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఈ వెహికల్ వెనుక ఆక్సిల్‌పై ఎలక్ట్రిక్ మోటారు ఫిక్స్ చేశారు. అదే దీని స్పెషాలిటీ. బ్యాటరీల కారణంగా కారు ఎత్తు పెరిగింది. రియర్ ఇండిపెండెంట్ సస్పెషన్‌తో ఇది ఆన్, ఆఫ్ రోడ్లపై దూసుకెళ్తుంది. కారు లుక్స్ ICE పవర్డ్ హారియర్ లాగానే ఉంటాయి. ముందు భాగంలో సీలర్ గ్రిల్, డేటైమ్ రన్నింగ్ లైట్లు, షార్పర్ టెయిల్ లైట్లు, ఏరో ఫ్రెండ్లీ అల్లాయ్ వీల్స్‌తో అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ SUV కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ వెహికల్ Acti .EV ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. డ్యుయల్ మోటార్ సెటప్ దాదాపు 500 Nm టార్క్‌ను జరనేట్ చేయగలదు. రిపోర్ట్స్ ప్రకారం.. హారియర్ సింగిల్ ఛార్జింగ్‌పై 500 కి.మీ రైడింగ్ రేంజ్ అందిస్తుంది. మెర్సిడెస్ త్వరలో కొత్త ఐకానిక్ మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ ఎడిషన్‌ను విడుదల చేయనుంది. ఇది మన దేశంలో లేటెస్ట్ G63 కలెక్టర్స్ ఎడిషన్ అవుతుంది.
ఇది కూడా చదవండి: వ్యవస్థలో మూలుగుతున్న రూ.2000 నోట్లు! 2025 మే 31 నాటికి..
దీని ప్రొడక్షన్ లిమిటెడ్‌గా ఉంటుంది. ఈ వెహికల్ లైట్ హైబ్రిడ్ ఎడిషన్స్ ఉండే 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 585 HP పవర్ అవుట్‌పుట్‌తో పాటు 850Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్‌తో వస్తుంది. దీని ధర దాదాపు రూ.3.64 కోట్లు ఉంటుంది. హ్యుందాయ్ కంపెనీ సబ్ కాంపాక్ట్ SUV వెన్యూ వెర్షన్‌కు త్వరలో కాస్మెటిక్ మార్పులతో కొత్త మోడల్‌ను లాంచ్ చేస్తోంది. కొత్త తరం వెన్యూ ఇటీవలే టెస్టింగ్‌లో కనిపించింది. అయితే హ్యుందాయ్ కంపెనీ ఇప్పటి వరకు వెన్యూ ఫేస్‌లిఫ్ట్ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. కానీ కారు పాత ఇంజిన్ ఆప్షన్స్‌తోనే రావచ్చు. 1.2 లీటర్ MPi పెట్రోల్, 1.5 CRDI VGT డీజిల్, కప్పా 1.0 టర్బో GDI పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వెహికల్ రావచ్చు. మారుతి సుజుకి కొత్త కాంపాక్ట్ 5 సీటర్ SUVని విడుదల చేయాలని యోచిస్తోందని మీడియా రిపోర్ట్స్ వెల్లడించాయి. ఇది చాలా కాలంగా ఇండియన్ మార్కెట్లో ఉన్న S-క్రాస్ లాగానే.. హ్యుందాయ్ గ్రాండ్ విటారా, బ్రెజ్జా కంటే తక్కువగా ఉండవచ్చు. ఈ వెహికల్ గురించి ఎలాంటి అఫీషియల్ నోట్ రాలేదు. అయితే ఈ కారు KIA సోనెట్, టాటా నెక్సాన్ వంటి వాటితో పోటీ పడే అవకాశం ఉంది. సబ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్ ఇది సక్సెస్ అవుతుందని కంపెనీ భావిస్తోంది. KIA సెల్టోస్ కొన్ని చిన్నపాటి అప్‌గ్రేడ్స్‌తో కొత్తగా రిలీజ్ కానుంది. ఈ కాస్మెటిక్ రిఫ్రెష్ వెర్షన్ ఇంటర్నేషనల్ మార్కెట్లలో టెస్టింగ్‌లో కనిపించింది. ఇటీవల ఇది ఇండియాలో కొత్త హ్యుందాయ్ వెన్యూతో పాటు టెస్టింగ్‌లో కనిపించింది. KIA సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కారుకు కొత్త లుక్ ఇచ్చే కొత్త హెడ్‌లైట్స్ యాడ్ చేశారు. వెహికల్ డిజైన్ పరంగా, ఫ్రంట్ పార్ట్‌ను మార్చారు. దీంట్లోని కొత్త పవర్‌ట్రెయిన్‌ను ఇండియన్ మార్కెట్‌కి కూడా తీసుకురావచ్చు.
ఇది కూడా చదవండి: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం! ఎన్డీఏ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నోటీసులకు స్పందించని అమెరికా.. రాయితీలకు కోత విధించే యోచనలో భారత్!
భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఎంతో దూరంలో లేదు! ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన..!
లాస్ ఏంజెల్స్‌లో మహానాడు సందడి! వైభవంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు!
అమెరికాలో మెరిసిన తెలుగు తేజం..! మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్‌ఏ రన్నరప్‌గా గుడివాడ అమ్మాయి!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: