ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్‌గా... టైమింగ్స్ మారాయి!
రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీసుకొస్తున్న సంస్కరణలు చక్కటి ఫలితాలను ఇస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు మెరుగవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Klayan) ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) గారి మార్గదర్శకత్వంలో విద్యా వ్యవస్థలో వస్తున్న సానుకూల మార్పులకు కడపలో ఏర్పాటైన 'స్మార్ట్ కిచెన్' ఒక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. గతంలో కడప (Kadapa) మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్నప్పుడు, జిల్లా కలెక్టర్ సూచించిన 'స్మార్ట్ కిచెన్' ఆలోచన తనను ఎంతగానో ఆకట్టుకుందని పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Chandrababu P4 Meeting: పీ4పై సమీక్ష.. చంద్రబాబు కీలక నిర్ణయం! 200 మంది టాప్ ఎన్ఆర్ఐలు..
బడి పిల్లలకు డొక్కా సీతమ్మ గారి పేరుతో పరిశుభ్రమైన, పోషకాలతో కూడిన భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ కిచెన్ నిర్మాణానికి తన వ్యక్తిగత నిధులను అందించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ 'స్మార్ట్ కిచెన్' నిర్మాణం పూర్తయిందని, ఇక్కడి నుంచే నగరంలోని 12 పాఠశాలలకు ఆహారాన్ని సరఫరా చేస్తారని తెలిపారు. పోషకాహార నిపుణుల సలహాలతో, అనుభవజ్ఞులైన వంట సిబ్బంది ద్వారా రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తారని వివరించారు. ఈ 'స్మార్ట్ కిచెన్' రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బృహత్కార్యాన్ని దగ్గరుండి పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి (Collector Dr. Sridhar Cherukuri) గారిని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు.
ఇది కూడా చదవండి: Airport: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ఏపీలో రెండు కొత్త విమానాశ్రయాలు! జిల్లాల దశ తిరిగినట్లే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం...! రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి సిట్ నోటీసులు!
Green Tax Reduction: వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.!
AP Farmers: ఏపీలోని మామిడి రైతులకు తీపికబురు..! రూ.260 కోట్లు విడుదల!
UAE Golden Visa: ఆశలతో ఆడుకుంటున్న ఏజెంట్లు..! యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన!
US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి! గాయపడిన వారిలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: