ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్‌‌గా... టైమింగ్స్ మారాయి!

ఆంధ్రప్రదేశ్‌ (AndhraPradesh) లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా, టెక్నాలజీని జోడించి రాష్ట్రంలోనే మొట్టమొదటి 'స్మార్ట్ కిచెన్'‌ను కడపలో ప్రారంభించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) వెల్లడిస్తూ, ఎంతో థ్రిల్లింగ్ గా ఉందంటూ ఈ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు. కడప (Kadapa) నగరంలోని మున్సిపల్ హైస్కూల్‌ (Municipal High School) లో ఈ అత్యాధునిక స్మార్ట్ కిచెన్‌ను ఏర్పాటు చేసినట్లు లోకేశ్ తెలిపారు. దీని ద్వారా కేంద్రీకృత విధానంలో ప్రస్తుతం 12 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 2,200 మంది విద్యార్థులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన, వేడివేడి భోజనాన్ని అందిస్తున్నారని వివరించారు.

ఇది కూడా చదవండి: Free Coaching: ఆ విద్యార్థులకు మంత్రి విద్యా సంస్థల్లో ఐఐటీ, నీట్ ఉచిత కోచింగ్! ఉచిత భోజన, వసతి సౌకర్యం..

ఈ స్మార్ట్ కిచెన్ ప్రత్యేకత టెక్నాలజీ (Technology) వినియోగమేనని ఆయన పేర్కొన్నారు. వంట చేసే దగ్గర నుంచి విద్యార్థులకు పంపిణీ చేసే వరకు ప్రతి దశను ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తారని చెప్పారు. దీనివల్ల భోజనం నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేయవచ్చని, విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా సేకరించడం సులభమవుతుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న బడ్జెట్ పరిధిలోనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండటం విశేషమని లోకేశ్ ప్రశంసించారు. త్వరలోనే మరో నాలుగు స్మార్ట్ కిచెన్లు నిర్మాణ దశ పూర్తి చేసుకోనున్నాయని, ఈ నూతన విధానం ద్వారా పిల్లలకు మరింత గౌరవంగా, జవాబుదారీతనంతో పౌష్టికాహారం అందించవచ్చని తెలిపారు. ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ శ్రీధర్‌ (Collector Sridhar) ను, జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.

ఇది కూడా చదవండి: Airport: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ఏపీలో రెండు కొత్త విమానాశ్రయాలు! జిల్లాల దశ తిరిగినట్లే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం...! రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి సిట్ నోటీసులు!

Green Tax Reduction: వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.!

Teacher Meeting: ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు రెడీగా ఉన్నారా.. ఈసారి చిన్న మార్పు.. పూర్తి షెడ్యూల్, టైమింగ్స్ ఇవే!

AP Farmers: ఏపీలోని మామిడి రైతులకు తీపికబురు..! రూ.260 కోట్లు విడుదల!

UAE Golden Visa: ఆశలతో ఆడుకుంటున్న ఏజెంట్లు..! యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన!

US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి! గాయపడిన వారిలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group