స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తాజాగా మోటో జీ86 పవర్ అనే కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 8జీబీ RAM మరియు 128జీబీ స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధరను ₹17,699గా నిర్ణయించారు. అయితే, కొనుగోలు సమయంలో బ్యాంక్ ఆఫర్ ద్వారా ₹1,000 తగ్గింపుతో కేవలం ₹16,999కే ఈ ఫోన్‌ను పొందవచ్చు. ఈ డివైస్ *సౌండ్‌తోనే కాకుండా*, ఫీచర్ల పరంగా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల 1.5K pOLED సూపర్ హెచ్‌ఎ ఫ్లాట్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉన్నాయి. మోటో జీ86 పవర్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత హలో యూఐతో పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 50MP ఓఐఎస్ ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, వెనుక భాగంలో ఫ్లిక్కర్ సెన్సార్‌తో పాటు 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మోటో ఏఐ ఫీచర్స్ ద్వారా AI ఫోటో ఎన్హాన్స్‌మెంట్, సూపర్ జూమ్, ఆటో స్మైల్ క్యాప్చర్ వంటి స్మార్ట్ ఫోటోగ్రఫీ మోడ్‌లు లభిస్తాయి.
ఈ ఫోన్‌లో 6720 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండగా, ఒకసారి ఛార్జ్ చేస్తే 53 గంటల వరకూ బ్యాకప్ ఇస్తుంది. ఇక 33W TurboPower ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఇందులో అందించారు. 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యం కూడా ఈ ఫోన్ ప్రత్యేకతల్లో ఒకటి. ఇక కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఇది మంచి option గా నిలవనుంది.