Header Banner

తల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

  Thu May 15, 2025 06:58        Politics

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ విజయంతో గెలిచింది కానీ.. పిల్లల్ని చదివిస్తున్న తల్లులకు మాత్రం ఇది ఆనందం కలిగించలేదు. ఎందుకంటే.. గత వైసీపీ ప్రభుత్వం.. గత సంవత్సరం అమ్మఒడి పథకం కింద ఇవ్వాల్సిన రూ.13,000 ఇవ్వలేదు. జూన్ 12 నుంచి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రారంభించి, మనీ ఇస్తుందేమో అనుకుంటే, అదీ జరగలేదు. ఇలా రెండు ప్రభుత్వాలూ తమను మోసం చేశాయని తల్లులు ఆవేదన చెందుతున్నారు. ఈ సమయంలో కూటమి ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ వస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అంటే.. జూన్ నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందన పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ప్రభుత్వ పథకాల్లో ఇది అతి పెద్ద పథకం. దీన్ని అమలు చెయ్యాలంటే.. వేల కోట్లు కావాలి. అందుకే గతేడాది ప్రభుత్వం దీని జోలికి వెళ్లలేదు.

ఈ సంవత్సరం కూడా దీన్ని అమలుచెయ్యకపోతే, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. అందుకే అమలు చేసేందుకు రెడీ అవుతోంది. దీనిపై ఒక అప్‌డేట్ వచ్చింది. జూన్ 12న అమ్మఒడి పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఇందుకు 2 కారణాలు ఉన్నాయి. వేసవి సెలవులు ముగిశాక, జూన్ 12న స్కూళ్లు తిరిగి ప్రారంభం అవుతాయి. అలాగే.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూడా జూన్ 12నే. అదే రోజున రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించబోతోంది. అలాగే.. తల్లులు, విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాన్ని కూడా ప్రారంభిస్తుంది అని ప్రచారం జరుగుతోంది. ఐతే.. ఈ తేదీని ప్రభుత్వం ఇంకా ఖరారు చెయ్యలేదు. కానీ.. ఆ రోజే ఈ పథకం కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం డబ్బును ఒకే విడతలో రూ.13,000 చొప్పున ఇచ్చేది. అలా 42 లక్షల మందికి పైగా తల్లుల బ్యాంక్ అకౌంట్లలో రూ.6వేల కోట్లకు పైగా జమచేసేది. కానీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద రూ.15,000 చొప్పున ఇస్తామంది. ఇలా ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే, అంతమందికీ ఇస్తామని చెప్పింది. అంటే.. ఈ పథకం అమలుకి కనీసం రూ.15వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్ల దాకా అవసరం అవ్వొచ్చు.

ఎందుకంటే.. కొన్ని ఇళ్లలో ఇద్దరు పిల్లలు ఉంటారు. కొన్ని ఇళ్లలో ముగ్గురు పిల్లలు ఉంటారు కదా. ఏపీ ప్రభుత్వం ఈ ఫథకం కోసం బడ్జెట్‌లో రూ.9,407 కోట్లు కేటాయించింది. ఇది ఏమాత్రం సరిపోదు. ఇంత తక్కువ మొత్తంతో దీన్ని అమలు చెయ్యాలంటే.. కుటుంబంలో ఒక పిల్లాడికి మాత్రమే అమలు చెయ్యగలరు. ఎంత మంది పిల్లలు ఉంటే, అంతమందికీ అమలు అనేది అసాధ్యం. కానీ ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఎంత మంది పిల్లలు ఉంటే, అంతమందికీ అమలు చెయ్యాల్సి ఉంటుంది. పైగా సీఎం చంద్రబాబు.. పిల్లల్ని కనమని ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. మరి బడ్జెట్‌లో ఎందుకు ఇంత తక్కువ కేటాయించారో తేలాలి. ఏ ఉద్దేశంతో ఇంత తక్కువ కేటాయించారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. తల్లికి వందనం పథకాన్ని ప్రతీ ఇంట్లో ఒక విద్యార్థికే అమలు చేస్తే మాత్రం అది ప్రజలను మోసం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే.. ఈ పథకం ఆరు సూపర్ సిక్స్ గ్యారెంటీ పథకాల్లో ఒకటి. మేనిఫెస్టోలో క్లియర్‌గా చెప్పారు కూడా. ఈ ఇమేజ్‌లో ఉన్నది మేనిఫెస్టోనే. అందులో సూపర్ సిక్స్ లోని రెండో హామీ ఇదే. స్కూలుకి వెళ్లే ప్రతీ విద్యార్థికీ సంవత్సరానికి రూ.15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. అందువల్ల తల్లులు ఈ డబ్బు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏటా ఒకే విడతలో అమ్మఒడి డబ్బు ఇస్తూ వచ్చింది. అలా 4 సార్లు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం కూడా ఒకే విడతలో ఇవ్వాలంటే.. రూ.9వేల కోట్లు చాలవు. అందువల్ల రెండు విడతల్లో ఇస్తుందా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. జూన్ 12 రావడానికి మరో 27 రోజులు టైమ్ ఉంది. ఆలోగా ప్రభుత్వం ఈ పథకం గైడ్‌లైన్స్ విడుదల చేసి, అర్హులు ఎవరో తేల్చాల్సి ఉంటుంది. దాని కోసమే తల్లులు ఎదురుచూస్తున్నారు. ఓ అంచనా ప్రకారం.. 1 నుంచి ఇంటర్ చదివే పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. అలాగే.. అటెండెన్స్ 75 శాతం ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకానికి అర్హులు కాదని తెలుస్తోంది. గైడ్‌లైన్స్ వచ్చాక క్లారిటీ వస్తుంది. ఒక విషయం మర్చిపోకూడదు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లోల చదివే విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తిస్తుంది అని స్వయంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఆయన చెప్పినవి చెప్పినట్లుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కాబట్టి.. ఆయన మాటపై తల్లులకు కొంత నమ్మకం ఉంది. అందువల్ల ప్రైవేట్ స్కూళ్లలో తమ పిల్లలను చదివిస్తున్న తల్లులు కూడా తల్లికి వందనం మనీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. జూన్ 12న ఈ పథకం అమలైతే, ఆనందమే.

ఇది కూడా చదవండిఏపీలో ఇకపై ఆ రూల్స్ పాటించాల్సిందే..! ప్రభుత్వం కీలక ఆదేశాలు..!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..


 నేడు (14/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #MatruVandana #MotherhoodSupport #APGovtWelfare #DirectBenefit #MotherScheme #EmpowerHer