Health ATM: క్షణాల్లో బ్లడ్‌ రిపోర్ట్స్‌! అందుబాటులోకి హెల్త్‌ ఏటీఎంలు!

2022లో వచ్చిన కాంతార సినిమా తెలుగు మాత్రమే కాదు, మొత్తం ఇండియానే తన వైపు తిప్పుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఆ సినిమా రిషబ్ శెట్టికి పెద్ద హిట్ అయ్యి చాలా ప్రశంసలు, అవార్డులు తెచ్చిపెట్టింది. అదే నమ్మకంతో రిషబ్ కాంతార చాప్టర్ 1ని భారీ బడ్జెట్‌తో తీశారు. మరి ఈ సినిమా ఆ రేంజ్‌ని అందుకుందా లేదా అనేది చూద్దాం.

కథ ఏమిటి?

కాంతార మొదటి పార్ట్‌లో హీరో అడిగిన ప్రశ్నతో సినిమా ముగిసింది. అదే ప్రశ్నతో ఈ ప్రీక్వెల్ స్టార్ట్ అవుతుంది. ఒక పెద్దాయన చెప్పే కాంతార కథే ఈ సినిమా.మనిషి తప్పు దారి ఎంచుకుంటే, ధర్మాన్ని కాపాడటానికి దేవుడు తన గణాలను పంపుతాడు. ఆ గణాలు కొలువైన ప్రదేశమే కాంతార అని చెబుతూ సినిమా మొదలవుతుంది.

కాంతార ప్రాంతం గురించి అక్కడి ప్రజలకు ఒక విశ్వాసం ఉంటుంది. ఇక్కడే శివుడు, పార్వతి ఆశీస్సులు ఉన్నాయని, ఇక్కడ ఒక పవిత్ర స్థలం ఉందని నమ్ముతారు. ఆ ప్రాంతంలో ఒకరోజు శివలింగం ఆకారంలో రాయి దొరుకుతుంది. దాన్నే వారు దేవుడిగా పూజించడం మొదలుపెడతారు.

ఇక బాంగ్రా మహారాజు అన్నవాడు అహంకారంతో రాజ్యాల్ని గెలుస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు కాంతార అడవిలోకి వెళ్లగానే ఒక అదృశ్య శక్తి దాడి చేస్తుంది. ఆ శక్తి కారణంగా రాజు చనిపోతాడు. అతని కొడుకు ఈ విషయం చూసి భయపడతాడు. ఎప్పుడూ తన పిల్లలకి కాంతారకి వెళ్ళొద్దు, అక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు అని చెబుతుంటాడు.

తర్వాత కులశేఖర (గుల్షన్ దేవయ్య) రాజు అవుతాడు. కానీ అతను ధైర్యంగా అన్నీ కట్టుకథలు అని ఫ్రెండ్స్‌తో కలిసి కాంతారకి వెళ్తాడు. అక్కడ కాంతార వాసులు వీరిని తరిమేస్తారు. ఇదిలా ఉండగా కాంతారలో ఒక చిన్న బిడ్డ దొరుకుతాడు. అతడే బర్మే (రిషబ్ శెట్టి) అతడే పెద్దయ్యాక కాంతార నాయకుడు అవుతాడు.

బర్మే బాంగ్రా రాజ్యానికి వెళ్ళి యువరాణి కనకావతిని (రుక్మిణి వసంత్) ఒక ప్రమాదం నుంచి రక్షిస్తాడు. దాంతో ఆమె బర్మేపై ప్రేమలో పడుతుంది. కానీ ఈ విషయం తెలిసి రాజు కోపంతో మొత్తం కాంతారను తగలబెట్టేస్తాడు. తరువాత ఏమైంది? కాంతారను ఎవరు కాపాడారు? అసలు బర్మే ఎవరు? అనే మిస్టరీతో సినిమా సాగుతుంది.

ఎలా తీశారు?

ఎక్స్‌పెక్టేషన్స్ లేని కాంతార చాలా ఫ్రెష్‌గా, కొత్తగా అనిపించింది. కానీ ఈసారి అంచనాలు ఎక్కువ. అందుకే ఏం చేసినా కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. రిషబ్ శెట్టి ఈసారి భారీ బడ్జెట్, పెద్ద సెట్‌లు, గ్రాండ్ విజువల్స్ చూపించారు. కానీ ఫస్టాఫ్‌లో కథ కొంచెం స్లోగా, లెంగ్త్‌గా అనిపిస్తుంది.

అయినా కూడా సెకండాఫ్ బాగా ప్రేక్షకులకు కొంచెం కష్టంగా చూపిస్తారు.. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, గుళిగ వచ్చేసినప్పుడు చూపించిన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. థియేటర్లో ఆడియన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. క్లైమాక్స్‌లో రిషబ్ యాక్టింగ్ టాప్ లెవెల్‌లో ఉందనే చెప్పుకోవాలి అదే సినిమాకి హైలైట్. వీఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. గుళిగ, దేవగణాల సీన్స్ స్క్రీన్ మీద నిజంగా కనిపించేలా తీశారు.

 నటన – మ్యూజిక్

రిషబ్ శెట్టి నటుడిగా మళ్లీ ఇరగదీశారు. రుక్మిణి వసంత్ ఫస్టాఫ్‌లో అందంగా, క్యూట్‌గా ఉంది. సెకండాఫ్‌లో ఆమె క్యారెక్టర్ సర్‌ప్రైజ్‌గానే ఉంది. యాక్షన్, ఎమోషన్ అన్నింట్లో బాగా చేశారు.గుల్షన్ దేవయ్య తన పాత్రలో ఒదిగిపోయి నటించడం చెప్పుకోవాలి.జయరామ్ చిన్న పాత్ర అయినా ఇంపాక్ట్ కలిగించారు. ఓవరాల్ గా మ్యూజిక్ – అజినీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకి కీలక పాత్ర పోషించారు. క్లైమాక్స్, రిషబ్ యాక్టింగ్, వీఎఫ్ఎక్స్ వర్క్ బలంగా నిలబెట్టాయి.అంచనాలు లేకుండా వెళ్తే కచ్చితంగా నచ్చుతుంది.




 

Chandrababu Foreign tour: చంద్రబాబు విదేశీ పర్యటనకు ముహూర్తం ఫిక్స్! గ్లోబల్ ఇన్వెస్టర్లతో కీలక భేటీలు!
మీ ఇంటికి తాబేలు రక్షణ కవచం.. అదృష్టం, సంపద రావాలంటే.! ఏ దిశలో పెట్టాలో తెలుసా?
దసరా.. సంస్కృతి, సంప్రదాయం, శాంతి, శ్రేయస్సు ప్రతీక!
Bhagavad Gita: దుష్టులను సత్పురుషులుగా మార్చగల మహాశక్తి గీతాజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 20!
ASEAN Summit: మోదీ ట్రంప్ పుతిన్ భేటీకి డేట్స్ ఫిక్స్.. ASEAN సమ్మిట్ వేదికగా చర్చలు!
Durgamma Theppotsavam: భక్తుల్లో నిరాశ.. దుర్గమ్మ తెప్పోత్సవం చూడలేక ఆవేదన.. TTD నుంచి దుర్గాదేవికి సారె సమర్పణ!
Private colleges: 13 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్‌.. ₹1200 కోట్ల బకాయిలలో కేవలం ₹200 కోట్లు మాత్రమే!
IdliKottu Review: ఇడ్లీ కొట్టు మూవీ.. ధనుష్ డబుల్ రోల్! హిట్టా... ఫట్టా!
Wine shops: రేపు వైన్ షాపులు బంద్.. గాంధీ జయంతి.. దసరా + జీతం కలిసివచ్చి వైన్ షాపుల వద్ద భారీ క్యూలు!