ఈ ఏడాది కుబేర సినిమాతో మంచి విజయం అందుకున్న ధనుష్, తన డైరెక్షన్‌లో చేసిన రాయన్ తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు ఇడ్లీ కొట్టు సినిమాతో వచ్చాడు. ట్రైలర్ విడుదలైనప్పుడు భావోద్వేగాలతో కూడిన సినిమా అని అనిపించింది. అయితే సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల అభిప్రాయాలు మిశ్రమంగా వచ్చాయి.
సినిమా కథలో హీరో తండ్రి ఒక చిన్న ఊరిలో ఇడ్లీ కొట్టు నడిపిస్తూ ఆ ఊరిని వదిలి వెళ్లకుండా ఉంటాడు. కానీ హీరో మాత్రం ఎదగాలంటే ఊరిని వదిలి బయటకు వెళ్లాలని నిర్ణయిస్తాడు. ఈ ప్రయాణంలో ఎదురైన పరిస్థితులు, ఊరిని మిస్ అవ్వడంతో తిరిగి వెళ్లాలనుకోవడం – ఇవే కథలోని ప్రధాన పాయింట్లు.

పెర్ఫార్మెన్స్ విషయంలో ధనుష్ మళ్లీ తన నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించాడు. నిత్యామీనన్ తన పాత్రలో ఆకట్టుకుంది. అరుణ్ విజయ్ నెగటివ్ రోల్‌లో బాగానే న్యాయం చేశాడు. ఇతర నటులు కూడా తమ పాత్రల్లో సరిపడ్డారు. కానీ సినిమా పొడవు ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సన్నివేశాలు బోరింగ్‌గా అనిపించాయి.
టెక్నికల్‌గా సినిమా అంతంత మాత్రంగానే నిలిచింది. ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే వీక్‌గా ఉండగా, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సాదారణంగా అనిపించాయి. ప్రొడక్షన్ విల్యూస్ మాత్రం బాగున్నాయి. కానీ దర్శకుడిగా ధనుష్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. నటుడిగా మెప్పించినా, డైరెక్షన్‌లో అదే స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.
మొత్తం మీద ఇడ్లీ కొట్టు సినిమా పెద్దగా అంచనాలు లేకుండా వెళ్లే ప్రేక్షకులకు కొన్ని సన్నివేశాల వరకు ఓకే అనిపిస్తుంది. కానీ ఎక్కువగా డ్రాగ్ అవుతూ బోరింగ్‌గా అనిపిస్తుంది. ధనుష్ డైరెక్షన్‌పై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. అందుకే ఈ సినిమాకు ఇచ్చిన రేటింగ్ 2.5 స్టార్‌లు మాత్రమే.