LIVE
Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  •  Retirement Age: పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు.. హైకోర్టు కీలక తీర్పు!  •  Health Tips: వీటిలో వాటర్ తాగుతున్నారా... అయితే వాటిని కొనితెచ్చుకున్నట్లే!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gulf

Iran: జలసంధిలో ఉద్రిక్తతలు.. డాల్ఫిన్లతో ఆత్మాహుతి దాడులు? వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంతో ఒక్కసారిగా కలకలం!

Iran: హ‌ర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ మైన్లతో అంతరాయం కలిగించవచ్చన్న ఆందోళనల మధ్య, అమెరికా నౌకాదళాన్ని ఎదుర్కొనేందుకు టెహ్రాన్ "కామికేజ్ డాల్ఫిన్లను" రంగంలోకి దించనుందంటూ వస్తున్న వార్తలపై తీవ్ర చర్చ జరుగుతోంది.

AndhraPravasi News Desk 2 min read
Iran: జలసంధిలో ఉద్రిక్తతలు.. డాల్ఫిన్లతో ఆత్మాహుతి దాడులు? వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంతో ఒక్కసారిగా కలకలం!
  • హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకలపై దాడికి ఇరాన్ డాల్ఫిన్లను వాడుతుందన్న ప్రచారం..
     
  • Gulf: తమ వద్ద 'కామికేజ్ డాల్ఫిన్లు' ఉన్నాయో లేదో చెప్పలేనంటూ వ్యాఖ్య..

Iran: హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ మైన్లతో అంతరాయం కలిగించవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో, అమెరికా నౌకాదళాన్ని ఢీకొనేందుకు టెహ్రాన్ "కామికేజ్ డాల్ఫిన్లను" రంగంలోకి దించుతోందన్న వార్తలు అంతర్జాతీయంగా పెను చర్చకు దారితీశాయి. ఈ ఊహాగానాలపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పందిస్తూ, ఇరాన్ వద్ద అటువంటి ఆత్మాహుతి డాల్ఫిన్ సైన్యం ఏదీ లేదని స్పష్టం చేశారు. అయితే, ఇదే తరహా వ్యవస్థ అమెరికా వద్ద ఉందా అనే ప్రశ్నకు మాత్రం ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. తమ వద్ద కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయో లేదో ధ్రువీకరించలేనని, అలా అని ఖండించలేనని వ్యాఖ్యానించిన ఆయన, ఇరాన్ వద్ద మాత్రం అవి లేవని కచ్చితంగా చెప్పగలనని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఏప్రిల్ 30న వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఒక కథనం ఈ చర్చకు మూలకారణం కాగా, అమెరికా యుద్ధ నౌకలపై దాడికి ఇరాన్ "మైన్లు మోసుకెళ్లే డాల్ఫిన్లను" వినియోగించే అవకాశం ఉందని ఆ పత్రిక పేర్కొంది.

వాస్తవానికి అమెరికా నౌకాదళం దశాబ్దాలుగా సైనిక అవసరాల కోసం "మెరైన్ మమ్మల్ ప్రోగ్రామ్" ద్వారా డాల్ఫిన్లకు శిక్షణ ఇస్తోంది. బాటిల్‌నోస్ డాల్ఫిన్లు, కాలిఫోర్నియా సీ లయన్‌లను వినియోగిస్తున్నప్పటికీ, ఇవి ఆత్మాహుతి దాడులు చేసే రకం కాదని అమెరికా స్పష్టం చేస్తోంది. యూఎస్ నేవీ శిక్షణ ఇచ్చే డాల్ఫిన్లు కేవలం సముద్ర గర్భంలో దాగి ఉన్న మైన్లను గుర్తించి వాటి లొకేషన్‌ను మార్క్ చేయడానికి మాత్రమే పరిమితమవుతాయని, అవి ప్రాణత్యాగం చేసే కామికేజ్ రకాలు కావని సమాచారం. డాల్ఫిన్ల సహజ సిద్ధమైన సోనార్ వ్యవస్థ ముందు మరే ఇతర టెక్నాలజీ లేదా నీటి అడుగున పనిచేసే డ్రోన్‌లు సరిపోవని సదరు ప్రోగ్రామ్ వెబ్‌సైట్ గర్వంగా చెబుతోంది.

గత చరిత్రను పరిశీలిస్తే రష్యా తన నౌకాశ్రయాల భద్రతకు డాల్ఫిన్లను వాడగా, 2000 సంవత్సరంలో ఇరాన్ కూడా కొన్ని డాల్ఫిన్లను కొనుగోలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అవి వయసు పైబడటం వల్ల క్రియాశీలకంగా ఉండే అవకాశం లేదని, ప్రస్తుతం టెహ్రాన్ వద్ద అటువంటి చురుకైన ప్రోగ్రామ్ ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రక్రియలో అమెరికా తన డాల్ఫిన్లను ఉపయోగించడం లేదని సీఎన్ఎన్ కథనం వెల్లడించింది.

Be the first to react

More Coverage

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ కీలక వ్యాఖ్యలు!

Israel & India: భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలను…

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: రూ.84 లక్షల ‘దియా’ చెల్లిస్తేనే సౌదీ జైలు నుంచి విడుదల.. రియాద్ జైలులో నిజామాబాద్ ప్రవాసి..

Gulf Updates: సౌదీ అరేబియాలోని రియాద్ జైలులో ఉన్న నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామా…