పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత సైన్యం చేపట్టిన “ఆపరేషన్ సింధూర్” లో రష్యా ఉత్పత్తి అయిన S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ప్రధాన పాత్ర పోషించింది. ఆపరేషన్‌లో పాకిస్థాన్ డ్రోన్‌లు మరియు క్షిపణులు భారత్ పై దాడి చేసినప్పుడు, ఈ ఆధునిక రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా వాటిని గుర్తించి, తిప్పికొట్టింది. దీనివల్ల భారత్ తన వాయు పరిరక్షణ సామర్థ్యాన్ని చాటుకోవడమే కాకుండా, పాకిస్థాన్ కు ఒక స్పష్టమైన సిగ్నల్ ఇచ్చింది.
భారత్ ఇప్పటికే నాలుగు S-400 యూనిట్లను రష్యా నుండి కొనుగోలు చేసేందుకు 2018లో 5.5 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం మొత్తం ఐదు యూనిట్లు భారత్ కు అందించబడనున్నాయి. నాలుగు యూనిట్లు ఇప్పటికే అందజేయబడ్డాయి. మిగతా ఐదో యూనిట్ వచ్చే ఏడాదికి అందించబడుతుంది. రష్యా మీడియా సంస్థ TASS ప్రకారం, చివరి యూనిట్ పంపిణీ 2026 నాటికి పూర్తవుతుందని స్పష్టం చేసింది.
S-400 ప్రపంచంలో అత్యంత ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలలో ఒకటి. ఇది ఉపరితలం నుండి గాలిలో ఉండే క్షిపణుల, డ్రోన్‌లు, ఇతర వైమానిక లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. రష్యాకు చెందిన అల్మాజ్-ఆంటె కంపెనీ ఈ వ్యవస్థను రూపకల్పన చేసింది. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని S-400 ట్రాక్ చేయగలదు. అంతేకాక 5 నుండి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగల సామర్థ్యం కూడా కలిగి ఉంది.
ఆపరేషన్ సింధూర్ సమయంలో, S-400 సిస్టమ్ తన శక్తిని పూర్తిగా చూపింది. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చే డ్రోన్‌లు, క్షిపణుల దాడులను నిరోధించి, భద్రతా స్థితిని ఘనంగా నిలుపుకుంది. దీనివల్ల భారత సైన్యం అత్యాధునిక రక్షణ వ్యవస్థలలో సుస్థిర స్థానం పొందింది.
భారత్-రష్యా సంబంధాల్లో S-400 ఒప్పందం అత్యంత కీలకంగా నిలిచింది. ఈ వ్యవస్థ భారత ఆకాశానికి అత్యంత శక్తివంతమైన రక్షణను అందించడంతో పాటు, పక్క ప్రాంతాల భద్రతా పరిస్థితులను కూడా మరింత స్థిరపరుస్తుంది. భవిష్యత్తులో భారత్, S-400 వంటి ఆధునిక వ్యవస్థల ద్వారా దేశ రక్షణలో మరింత బలాన్ని చాటగలదు.