తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం అనుసారంగా వంటగ్యాస్ సిలిండర్‌ను రూ.500కే లబ్ధిదారులకు అందిస్తూ, సామాన్య ప్రజలకు పెట్రోలియం ధరల భారాన్ని తగ్గించేందుకు విశేష ప్రయత్నాలు చేస్తోంది. ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్‌ను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసిన తర్వాత, తేడా మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డీబీటీఎల్ (Lpg) విధానంలో జమ చేస్తున్నారు. ప్రతి నెల జమ చేయకపోయినా, రెండు మూడు నెలల వ్యవధిలో ఒక్కసారిగా రాయితీ నగదు లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ అవుతోంది.
ఇది కూడా చదవండి: NH Green signal:ఏపీలో కొత్తగా మరో నేషనల్ హైవే! రూ.2,500 కోట్లతో ..ఈ రూట్‌లోనే 1 గంటలో తిరుపతి!
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈ ఏడాది జూన్ 25వ తేదీ వరకు మొత్తం 1,50,131 మంది లబ్ధిదారులు మహాలక్ష్మి(Maha lakshmi) పథకం ద్వారా 5,58,981 గ్యాస్ సిలిండర్లు పొందారు. ఈ సమయంలో ప్రభుత్వం మొత్తం రూ.16 కోట్ల 5 లక్షల 11 వేల 978 రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసింది. ఇందువల్ల ఎంతో మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు గ్యాస్ ధరల భారం తగ్గి ఊరట లభించింది.
ఇది కూడా చదవండి: Pumped Hydro Storage: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! 360 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ప్రజల(peoples) అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోందని సమాచారం. ఈ పథకం క్రమంగా మరింత మందికి విస్తరించి, అన్ని హక్కుదారులకు సకాలంలో రాయితీ అందేలా చూడాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ రాయితీ పథకం (మహాలక్ష్మి పథకం) ప్రారంభించిన తొలినాళ్లలో ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా పని చేసి ప్రతి నెలా సక్రమంగా రాయితీ నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వచ్చింది. అయితే కొంతకాలానికే కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొన్ని ఖాతాల్లో చెల్లింపులు నిలిచిపోయాయి.
ఇది కూడా చదవండి: National Highways: ఆ జాతీయ రహదారులకు మారనున్న రూపు రేఖలు! 988 కిలో మీటర్ల మేర విస్తరణ!
ప్రధానంగా, కొందరు లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతా నంబర్లు లేదా ఆధార్ నంబర్లు తప్పుగా ఇచ్చినందున వారికి డబ్బులు జమ కాకుండా నిలిచిపోయాయి. ఈ లోపాన్ని గుర్తించిన ప్రభుత్వం సూచనలతో లబ్ధిదారులు తమ ప్రస్తుతంలో ఉపయోగిస్తున్న బ్యాంకు ఖాతా వివరాలను గ్యాస్ ఏజెన్సీలకు సమర్పించడంతో, వారికి కూడా రాయితీ నగదు జమ కావడం ప్రారంభమైంది. అయితే ఇది సమష్టిగా అందరికీ ఒకేసారి జరగకపోవడం వల్ల కొంత గందరగోళం నెలకొంది. కొందరికి ఫిబ్రవరి 2024 వరకు, మరికొందరికి ఏప్రిల్ వరకు రాయితీ డబ్బులు వచ్చాయని, ఇంకొందరికి అయితే గత ఏడాది నవంబర్ వరకు మాత్రమే నగదు జమ అయినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Ohio plane crash: అమెరికాలో దారుణం.. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిన విమానం!
ఈ నేపథ్యంలో, లబ్ధిదారులు తమ ఖాతా వివరాలను ఏజెన్సీల వద్ద సరిచూసుకోవడం ద్వారా ఇప్పటి వరకు ఎంత మొత్తం నగదు వచ్చిందో తెలుసుకోవచ్చు. కానీ నగదు జమ కాకపోవడం వల్ల కొందరు లబ్ధిదారులు ఏజెన్సీల వద్ద వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఒక్కో లబ్ధిదారుకు మూడు నుంచి నాలుగు సిలిండర్ల రాయితీ మొత్తాన్ని ఒకేసారి ప్రభుత్వం జమ చేస్తోంది. దీంతో కొంత ఆలస్యం అయినా, నగదు పూర్తిగా లేకుండా పోతేనే అనుమానించాలి, లేదంటే అది మరుసటి నెలలో జమ అయ్యే అవకాశం ఉంది.
Srisailam Reservoir: శ్రీశైలానికి ముంచెత్తుతున్న వరద.. గంటగంటకూ - ప్రారంభమైన విద్యుత్ ఉత్పత్తి!
ప్రభుత్వం డేటా సరిపోల్చి, క్రమంగా మిగిలిన వారికి కూడా నగదు జమ చేసే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నిజామాబాద్ పట్టణంలో స్వాతి అనే మహిళ మాట్లాడుతూ.. రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం మరింత సమర్థంగా అమలు చేయాలని కోరుతున్నారు. సిలిండర్ బుక్ చేసిన తర్వాత, డెలివరీ అయిన రెండు మూడు రోజుల్లోనే డబ్బులు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి: New Rules: జూలై 1 నుంచి మారనున్న కొత్త రూల్స్! పాన్ కార్డు, ఆధార్, గ్యాస్ నుంచి టికెట్ ధరల వరకు! తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
WhatsApp Governance: ఏపీలో ఇకపై వాట్సప్ నుండే పన్నుల చెల్లింపు! ఆ అక్రమాలకు చెక్!
Tirupati Trains: కర్ణాటక నుంచి తిరుపతికి వీక్లీ ఎక్స్ ప్రెస్! ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే!
E-Passport: చిప్‌తో కొత్త పాస్‌పోర్టులు! ఏమిటీ ఈ-పాస్‌పోర్ట్? ఎలా పనిచేస్తుంది?
Hyderabad To Vizag: హైదరాబాద్-విశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్! 2 గంటలు తగ్గబోతున్న దూరం?
Gold Pricedrop: తొందరపడి బంగారం ఇప్పుడే కొనకండి.. ధరలు ఇంకా భారీగా తగ్గబోతున్నాయి! కారణం ఏంటంటే?
AP Rains: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా.. ఈ ప్రాంతాలకు ఉరుములతో వర్షాలు!
Lokesh wishes: ప్రసాద్‌ను అభినందించిన లోకేశ్! విశాఖ జిల్లా మత్స్యకార గ్రామానికి..
Super Plan: ఏపీ ప్రభుత్వం సూపర్ ప్లాన్! ఆ 8 ప్రాంతాలకు మహర్దశ!
First Digital Highway: దేశంలో తొలి ఏఐ డిజిటల్ హైవే! ఎక్కడో తెలుసా?
AP Government: మరో పథకానికి డేట్ ఫిక్స్! ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: