ఇది కూడా చదవండి: NH Green signal:ఏపీలో కొత్తగా మరో నేషనల్ హైవే! రూ.2,500 కోట్లతో ..ఈ రూట్‌లోనే 1 గంటలో తిరుపతి!


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ జులై 17 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మొత్తం మూడు విడతల్లో కౌన్సెలింగ్‌ జరగనుంది. అయితే మొదటి రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయ్యాక మూడో విడత కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం ఇంజనీరింగ్‌ మొదటి సెమిస్టర్‌ తరగతులు ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

ఇది కూడా చదవండి:  New Rules: జూలై 1 నుంచి మారనున్న కొత్త రూల్స్! పాన్ కార్డు, ఆధార్, గ్యాస్ నుంచి టికెట్ ధరల వరకు! తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!

ఈ క్రమంలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత శాతం భారీగా పెరడంతో అడ్మిషన్లు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈఏపీసెట్‌ 2025 ఇంజనీరింగ్‌లో 1,89,748 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గతేడాది మొత్తం 1.81 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు అందుబాటులోకి రాగా.. ఈసారి 2 లక్షలకుపైగా సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రైవేటు యూనివర్సిటీలు పెరగడమే అందుకు కారణం. అయితే సీట్ల వివరాలకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే అధికారిక ప్రకటన జారీ చేయనుంది.

ఇది కూడా చదవండి: Ohio plane crash: అమెరికాలో దారుణం.. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిన విమానం!

తాజా షెడ్యూల్ ప్రకారం మొదటి విడత కౌన్సెలింగ్‌ జులై 17 నుంచి ఆగస్టు 2 వరకు చేపట్టనుంది. ఇక రెండో విడత కౌన్సెలింగ్‌ ఆగస్టు 10 నుంచి నిర్వహించే అవకాశం ఉంది. మొదట ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ చేపట్టిన తర్వాత ఫార్మసీ కౌన్సెలింగ్‌ నిర్వహించి సీట్లు భర్తీ చేయనున్నారు. వ్యవసాయ కోర్సులకు ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. మరోవైపు ఇంజనీరింగ్‌ ఫీజులను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. కాలేజీల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో 2024-25 విద్యా సంవత్సరానికి మాత్రమే ఫీజులు ఖరారు చేశారు. ఈ ఏడాది కొత్త ఫీజులను నిర్ణయించాల్సి ఉంది.


అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

 National Highways: ఆ జాతీయ రహదారులకు మారనున్న రూపు రేఖలు! 988 కిలో మీటర్ల మేర విస్తరణ!

 WhatsApp Governance: ఏపీలో ఇకపై వాట్సప్ నుండే పన్నుల చెల్లింపు! ఆ అక్రమాలకు చెక్!

Tirupati Trains: కర్ణాటక నుంచి తిరుపతికి వీక్లీ ఎక్స్ ప్రెస్! ఏపీలో హాల్ట్ స్టేషన్లు ఇవే!

E-Passport: చిప్‌తో కొత్త పాస్‌పోర్టులు! ఏమిటీ ఈ-పాస్‌పోర్ట్? ఎలా పనిచేస్తుంది?

Hyderabad To Vizag: హైదరాబాద్-విశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్! 2 గంటలు తగ్గబోతున్న దూరం?

Gold Pricedrop: తొందరపడి బంగారం ఇప్పుడే కొనకండి.. ధరలు ఇంకా భారీగా తగ్గబోతున్నాయి! కారణం ఏంటంటే?

Tata Nano EV 2025 : టాటా నానో ఎలక్ట్రిక్ కారు వస్తోందోచ్.. లాంచ్ డేట్ ఇదేనట! ఫుల్ ఛార్జ్‌ చేస్తే 260 కి.మీ రేంజ్!

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా.. ఈ ప్రాంతాలకు ఉరుములతో వర్షాలు!

Lokesh wishes: ప్రసాద్‌ను అభినందించిన లోకేశ్! విశాఖ జిల్లా మత్స్యకార గ్రామానికి..

Super Plan: ఏపీ ప్రభుత్వం సూపర్ ప్లాన్! ఆ 8 ప్రాంతాలకు మహర్దశ!

First Digital Highway: దేశంలో తొలి ఏఐ డిజిటల్ హైవే! ఎక్కడో తెలుసా?

AP Government: మరో పథకానికి డేట్ ఫిక్స్! ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group